T20 world cup: సెమీస్ కి ముందు ఆస్పత్రిలో.. కొలుకోని వచ్చి మ్యాచ్ ఆడిన రిజ్వాన్..!

Published : Nov 12, 2021, 10:33 AM ISTUpdated : Nov 12, 2021, 10:51 AM IST
T20 world cup: సెమీస్ కి ముందు ఆస్పత్రిలో.. కొలుకోని వచ్చి మ్యాచ్ ఆడిన రిజ్వాన్..!

సారాంశం

అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్‌కు దూరంగా ఉండమని సూచించినప్పటికీ రిజ్వాన్ తాను ఈ కీలక మ్యాచ్‌లో ఆడి తీరతాన‌ని ప‌ట్టుబట్టాడ‌ట‌. ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించాక ఆడేందుకు అనుమతించారు.

T20 Worldcup లో పాకిస్తాన్ పోరు ముగిసింది. సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా చేతిలో పాకిస్తాన్ ఓటమి పాలైంది. దీంతో.. ఇంటికి తిరుగు పయనమైంది. పాకిస్తాన్ ఓటమిపాలైనందుకు.. ఇండియా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సంఘటన పక్కన పెడితే..  మ్యాచ్ ఓడినా.. పాకిస్తాన్ క్రికెటర్ మొహమ్మద్ రిజ్వాన్  పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆట పట్ల ఆయనకు ఉన్న అంకిత భావానికి అందరూ ఫిదా అవుతున్నారు.

Also Read: సెమీస్‌లో ఓడిన పాకిస్తాన్, టాపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకున్న టీమిండియా ఫ్యాన్స్... అసలు కారణం ఇదే!

సెమీస్ మ్యాచ్‌కి రెండ్రోజుల ముందు రిజ్వాన్ .. ఛాతీలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ కార‌ణంగా ఆసుప‌త్రిలో అడ్మిట్ అయ్యాడు. రెండు రాత్రులు ఐసీయూలోనే ఉన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు కోలుకున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి ఇప్పుడిప్పుడే మెరుగుపడటంతో మ్యాచ్‌కు దూరంగా ఉండమని సూచించినప్పటికీ రిజ్వాన్ తాను ఈ కీలక మ్యాచ్‌లో ఆడి తీరతాన‌ని ప‌ట్టుబట్టాడ‌ట‌. ఫిట్‌గా ఉన్నాడని నిర్ధారించాక ఆడేందుకు అనుమతించారు.

Also Read: T20 Worldcup 2021: ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా... పాకిస్తాన్ వరుస విజయాలకు బ్రేక్ వేసిన ఆసీస్...

ఆసీస్ తో మ్యాచ్ ముగిసిన తర్వాత పాక్ క్రికెట్ దిగ్గజం షోయబ్ అక్తర్ పంచుకున్న ఫొటో షేర్ చేస్తూ.. పాక్ వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ మ్యాచ్ కు ముందు రెండ్రోజులు రిజ్వాన్ ఐసీయూలో చికిత్స పొందాడని అక్తర్ వెల్లడించారు. అతని డెడికేష‌న్ చూసి ప్ర‌తి ఒక్క‌రు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.

 ఆస్ట్రేలియాతో మ్యాచ్ లో రిజ్వాన్ అద్భుతంగా రాణించి 67 పరుగులు నమోదు చేశాడు. అనారోగ్యం ఛాయలేవీ కనిపించకుండా అద్భుతంగా ఆడాడు. ఆపై వికెట్ కీపింగ్ కూడా ఎంతో మెరుగ్గా చేశాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో మహ్మద్ రిజ్వాన్ ఒక సంవత్సరంలో 1000 అంతర్జాతీయ టీ20 పరుగులు చేసి రికార్డును సృష్టించాడు. ప్రపంచంలో ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ సృష్టించాడు.

PREV
click me!

Recommended Stories

IND vs SA: 3 సెంచరీలు, 3 ఫిఫ్టీలతో 995 రన్స్.. గిల్ ప్లేస్‌లో ఖతర్నాక్ ప్లేయర్ తిరిగొస్తున్నాడు !
IPL 2026 Auction: ఐపీఎల్ మినీ వేలం సిద్ధం.. 77 స్థానాలు.. 350 మంది ఆటగాళ్లు! ఆర్టీఎమ్ కార్డ్ ఉంటుందా?