ఆ పాక్ క్రికెటర్‌కి భారత డాక్టర్ సాయం... కృతజ్ఞతగా జెర్సీని కానుకగా ఇచ్చిన మహ్మద్ రిజ్వాన్...

By Chinthakindhi RamuFirst Published Nov 13, 2021, 12:40 PM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021 ఆస్ట్రేలియాతో సెమీ ఫైనల్‌కి ముందు ఛాతి ఇన్‌ఫెక్షన్‌తో ఐసీయూలో చికిత్స తీసుకున్న మహ్మద్ రిజ్వాన్... పాక్ ఓపెనర్‌కి చికిత్సనందించిన భారతీయ డాక్టర్...

టీ20 వరల్డ్‌కప్ 2021  టోర్నీలో పాకిస్తాన్ జట్టు అదిరిపోయే ఆటతీరు చూపించింది. అసలు ఏ మాత్రం అంచనాలు లేకుండా అండర్‌ డాగ్స్‌గా టోర్నీని ఆరంభించింది, సూపర్ 12 రౌండ్‌లో వరుసగా ఐదుకి ఐదు విజయాలు అందుకున్న టీమ్‌గా రికార్డు క్రియేట్ చేసింది... టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టుగా నిలిచిన పాకిస్తాన్, ఆడిన ఆరుకి ఆరు మ్యాచుల్లోనూ ఒకే జట్టుతో బరిలో దిగి రికార్డు క్రియేట్ చేసింది.

ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ముందు పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఛాతి ఇన్ఫెక్షన్ కారణంగా రెండు రోజులు ఐసీయూలో గడిపాడు. సరిగా ఆస్ట్రేలియా మ్యాచ్‌కి ముందు రోజు కోలుకుని, నేరుగా బ్యాటుతో బరిలో దిగాడు... మహ్మద్ రిజ్వాన్ ఇంత వేగంగా కోలుకోవడం వెనక ఓ భారతీయ డాక్టర్ కృషి ఉంది. అతనే డాక్టర్ షహీర్ సైనాలబ్దీన్... 

‘ముజే ఖేల్‌నా హై, టీమ్ కే సాత్ రెహ్‌నా హై.. ’ (నేను ఎలాగైనా ఈ మ్యాచ్ ఆడాలి, జట్టుతో ఉండాలి...) ఐసీయూలో ఉన్నప్పుడు మహ్మద్ రిజ్వాన్, డాక్టర్‌తో చెప్పిన వ్యాఖ్యలు ఇవి.  ‘రిజ్వాన్ ఎలాగైనా సెమీస్ మ్యాచ్ ఆడాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు. అతని దృఢమైన మనస్తత్వం, పట్టుదల కారణంగానే త్వరగా కోలుకోగలిగాడు...’ అంటూ చెప్పుకొచ్చాడు దుబాయ్‌లోని మెడెరో ఆసుపత్రిలో పల్మోనాలజిస్ట్‌గా పనిచేస్తున్న డాక్టర్ షహీర్.

ఇది చదవండి: షాకింగ్: సెక్స్ స్కాండిల్‌లో ఇరుక్కున్న హార్దిక్ పాండ్యా... మునాఫ్ పటేల్, రాజీవ్ శుక్లాతో పాటు...

నవంబర్ 9న రాత్రి 12:30 సమయంలో ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిపడుతూ ఆసుపత్రిలో చేరిన మహ్మద్ రిజ్వాన్, జ్వరం, దగ్గు, ఛాతీ పట్టేయడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడట.

‘సాధారణంగా అయితే ఇలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పూర్తిగా కోలుకోవడానికి కనీసం 5 నుంచి వారం రోజుల సమయం పడుతుంది. అయితే రిజ్వాన్ మాత్రం దేవుడిని నమ్మాడు. ఎలాగైనా సెమీ ఫైనల్ ఆడేలా చేయమని వేడుకున్నాడు. అందుకే 35 గంటల్లో ఐసీయూలో గడిపిన తర్వాత వేగంగా కోలుకుని, అందర్నీ ఆశ్చర్యపరిచాడు... అతను రికవరీ అయిన వేగం చూసి మేం కూడా షాక్ అయ్యాం...  అతను మ్యాచ్‌లో సిక్సర్లు బాదుతుంటే, మేం ఇక్కడ ఎంతగానో సంతోషించాం... ’ అంటూ చెప్పుకొచ్చాడు భారతీయ డాక్టర్ షహీర్ సైనాలబ్దీన్...

తాను ఇంత త్వరితంగా కోలుకోవడానికి కారణమైన భారతీయ డాక్టర్ షహీర్‌కి కృతజ్ఞతగా తాను ఆటోగ్రాఫ్ చేసిన జెర్సీని అందచేశాడు మహ్మద్ రిజ్వాన్... పాకిస్తాన్‌, ఇండియా మధ్య జరిగిన మ్యాచ్‌లో బాబర్ ఆజమ్‌తో కలిసి 152 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పిన మహ్మద్ రిజ్వాన్, ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో 52 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఈ దశలో ఒకే ఏడాదిలో వెయ్యి టీ20 పరుగులు అందుకున్న మొదటి ప్లేయర్‌గా చరిత్ర క్రియేట్ చేశాడు రిజ్వాన్...

Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 4 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేయగా, ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 19 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఫైనల్‌కి చేరుకుంది. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో పాకిస్తాన్ పేసర్ హసన్ ఆలీ క్యాచ్ జారవిడచడంతో అతన్ని, అతని కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తూ, సోషల్ మీడియా వేదికగా తీవ్రపదజాలంతో దాడి చేస్తున్నారు పాక్ క్రికెట్ ఫ్యాన్స్...

click me!