Asianet News TeluguAsianet News Telugu

షాకింగ్: సెక్స్ స్కాండిల్‌లో ఇరుక్కున్న హార్దిక్ పాండ్యా... మునాఫ్ పటేల్, రాజీవ్ శుక్లాతో పాటు...

 దావూద్ ఇబ్రహీం భార్య సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్ముమా భాటి ఇచ్చిన ఫిర్యాదులో క్రికెటర్లు హార్ధిక్ పాండ్యా, మునాఫ్ పటేల్, రాజీవ్ శుక్లాల పేర్లు...

after T20WC Exit, Hardik Pandya along with Munaf Patel, Rajeev Shukla names in Sex Scandal
Author
India, First Published Nov 12, 2021, 4:28 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భారత జట్టు ప్రదర్శన అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్‌గా జట్టులో చోటు దక్కించుకున్న హార్ధిక్ పాండ్యా, ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో కొన్ని మెరుపులు మెరిపించడం మినహా పెద్దగా రాణించలేకపోయాడు... ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో భారత జట్టు గ్రూప్ స్టేజ్‌కి పరిమితం కావడంతో హార్ధిక్ పాండ్యా, తన భార్య నటాశాతో కలిసి మాల్దీవుల్లో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నాడు...

మాఫియా లీడర్, అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం భార్య సహాయకుడు రియాజ్ భాటి భార్య రెహ్ముమా భాటి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కొన్ని సంచలన ఆరోపణలు చేసింది. తన భర్త కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీలతో బలవంతంగా పడుకోబెట్టేవాడని, రియాజ్ భాటిపై ఫిర్యాదు చేసింది...

ఈ ఫిర్యాదులో భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యాతో పాటు మాజీ పేసర్ మునాఫ్ పటేల్ పేరు, బీసీసీఐ మాజీ ఛైర్మెన్ రాజీవ్ శుక్లా, పృథ్వీరాజ్ కొథారి వంటి సెలబ్రిటీల పేర్లు ఉండడం విశేషం...
తన భర్త రియాజ్ భాటి, గ్యాంగ్‌ స్టర్‌గా కావడానికి తన వ్యాపార భాగస్వామ్యులతో పడుకోవాలని తనను ఒత్తిడి చేసేవాడని, అలా కొందరు హై ప్రొఫైల్ సెలబ్రిటీల వద్దకు తనను పంపాడని ఫిర్యాదులో వెల్లడించింది రెహ్ముమా భాటి...

Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...

అయితే రెహ్ముమా ఇచ్చిన ఫిర్యాదులో ఓ నిర్ధిష్ట అడ్రెస్ ఇవ్వకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ‘నేను పోలీసులను సంప్రదించి, ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నా. అయితే పోలీసులు నా ఫిర్యాదును తీసుకోవడం లేదు. నేను సెప్టెంబర్ నెలలో అప్లికేషన్ ఇచ్చాను. ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి.

ఈ రెండు నెలల్లో చాలా మంది పోలీస్ అధికారులను కలిశాను, నా కంప్లైంట్ ఏమైందని అడిగాను. అయితే వాళ్లు మాత్రం డబ్బులు కావాలని అడుగుతున్నారు. నా దగ్గర వారికిచ్చేందుకు డబ్బులు లేవు. ఒకవేళ డబ్బులు ఉన్నా, ఫిర్యాదు చేయడానికి లంచం ఎందుకు ఇవ్వాలి. నా వైపు న్యాయం ఉంది. వాళ్లందరూ క్రిమినల్స్...’ అంటూ ఆమె కామెంట్ చేసింది...

ముంబై డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ మంజునాథ్ సింగే, ఆమె అప్లికేషన్ ఇచ్చింది నిజమేనని తెలిపాడు. అయితే ఆమె వద్ద జరిగిన సంఘటన గురించి కానీ, ఫిర్యాదులో పేర్కొన్న వారి గురించి పెద్దగా సమాచారం తెలియదని చెప్పినట్టు తెలిపారు. ఆమె మానసిక పరిస్థితి సరిగానే ఉందా? లేదా? అనే విషయం తేలిన తర్వాతే ఎఫ్‌ఐఆర్ నమోదుచేస్తామని తెలియచేశారు...

ఇంతకుముందు ‘కాఫీ విత్ కరణ్ షో’ కార్యక్రమంలో చేసిన కొన్ని చీప్ కామెంట్ల కారణంగా వివాదాల్లో ఇరుక్కుని, ఓ మ్యాచ్‌ నిషేధానికి గురైన హార్ధిక్ పాండ్యా, రెండేళ్లుగా వెన్ను గాయంతో బాధపడుతున్నాడు. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో బౌలింగ్ చేయని హార్ధిక్ పాండ్యా, టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో బౌలింగ్ చేసినా వికెట్లు తీయలేకపోయాడు...

న్యూజిలాండ్‌తో జరిగే సిరీస్ నుంచి హార్ధిక్ పాండ్యాను తప్పించిన సెలక్టర్లు, అతని స్థానంలో యంగ్ ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌కి అవకాశం ఇచ్చారు. అయ్యర్ క్లిక్ అయితే హార్ధిక్ పాండ్యా కెరీర్‌ ప్రమాదంలో పడినట్టే...
Read Also: ఏంటీ ఫీల్డింగ్! ఈ మ్యాచ్ ఫిక్స్ చేశారా... పాకిస్తాన్‌ని ట్రోల్ చేస్తున్న టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్...

Follow Us:
Download App:
  • android
  • ios