చంపేస్తామని బెదిరిస్తున్నారు, కాపాడండి... భారత ప్రభుత్వానికి హసన్ ఆలీ భార్య విన్నపం...

By Chinthakindhi RamuFirst Published Nov 13, 2021, 11:39 AM IST
Highlights

టీ20 వరల్డ్‌కప్ 2021  ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో క్యాచ్ డ్రాప్ చేసిన హసన్ ఆలీ... పాక్ పేసర్ కుటుంబాన్ని చంపేస్తామని సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు...

క్రికెట్ వరల్డ్‌, సోషల్ మీడియాకి మధ్య ఉన్న అంతరం రోజురోజుకీ తగ్గిపోతోంది. ఒకప్పుడు తమ జట్టు సరిగా పర్ఫామ్ చేయకపోతే వారి దిష్టి బొమ్మలు దహనం చేసి, ఫోటోలు, ఫెక్సీలను తగులబెట్టి నిరసన వ్యక్తం చేసేవాళ్లు అభిమానులు. అయితే ఇప్పుడు క్రికెటర్లు ఫీల్డ్‌లో చేసే చిన్నచిన్న తప్పులు, వారి ప్రాణాల మీదికి తెస్తున్నాయి. టీ20 వరల్డ్‌కప్ 2021   టోర్నీలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 17వ ఓవర్ వేసిన మహ్మద్ షమీ, 17 పరుగులు సమర్పించడంతో సోషల్ మీడియాలో విద్వేషపూరిత మెసేజ్‌లు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది...

పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ బాగా ఆడినా, న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో పెద్దగా రాణించకపోవడంతో ఆయన నెలల కూతురిపై అత్యాచార బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు పాకిస్తాన్ పేసర్ హసన్ ఆలీ ఈ విధమైన బెదిరింపులను ఎదుర్కొంటున్నాడు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది.

విజయానికి 10 బంతుల్లో 20 పరుగులు కావాల్సిన దశలో ఆస్ట్రేలియా వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ ఇచ్చిన క్యాచ్‌ను బౌండరీ లైన్ దగ్గర హసన్ ఆలీ అందుకోలేకపోయాడు...కీలక సమయంలో వచ్చిన లైఫ్‌ని చక్కగా వాడుకున్న మాథ్యూ వేడ్, షాహీన్ ఆఫ్రీదీ వేసిన ఆఖరి మూడు బంతుల్లో మూడు సిక్సర్లు బాది మ్యాచ్‌ను ముగించేశాడు. మాథ్యూ వేడ్ క్యాచ్ పట్టుకుని ఉంటే, మ్యాచ్ గెలిచేవాళ్లమంటూ పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ కూడా కామెంట్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది...

ఇది చదవండి: షాకింగ్: సెక్స్ స్కాండిల్‌లో ఇరుక్కున్న హార్దిక్ పాండ్యా... మునాఫ్ పటేల్, రాజీవ్ శుక్లాతో పాటు...

ఈ మ్యాచ్ తర్వాత హసన్ ఆలీని, ఆయన భార్య సమీయా అర్జోపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర పదజాలంతో దాడి చేస్తున్నారు పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్స్. సమీయా అర్జో భారతీయులు రావడంతో ఆమెను బూతులు తిడుతూ, విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసే వారి సంఖ్య మరీ ఎక్కువగా ఉంది... దీంతో హర్యానాలోని ఫరియాబాద్‌కి చెందిన సమీయా, భారత ప్రభుత్వాన్ని రక్షణ కోరుతూ ట్వీట్ చేసింది...

‘కొందరు సిగ్గులేని క్రికెట్ ఫ్యాన్స్ నా ఏడాది కూతురిని కూడా వదలకుండా తిడుతున్నారు. చంపుతామని బెదిరిస్తున్నారు. నాకు ఉన్నతాధికారుల నుంచి రక్షణ కల్పిస్తామని భరోసా రాకపోతే, నేను హర్యానాలోని మా అమ్మగారికి వెళ్లిపోతాను. భారత విదేశీ వ్యవహరాల మంత్రి డాక్టర్ జై శంకర్ గారు, ఓ భారతీయురాలిగా నా రక్షణ బాధ్యతను స్వీకరించాల్సిందిగా కోరుతున్నా’ అంటూ ట్వీట్ చేసింది సమీయా అర్జో...

‘నేను భారతీయురాలిగా జన్మించినందుకు గర్వపడుతున్నా. అదే విధంగా నేనే ఏ RAW ఏజెంట్‌ని కాదని, మా ఆయనని ఆ క్యాచ్ కావాలని వదిలేయలేదని పాకిస్తాన్ జనాలకు తెలియచేస్తున్నా. ఎందుకంటే ఆయన షియా మతానికి చెందిన వాడు. దయచేసి మమ్మల్ని సురక్షితంగా బతక నివ్వడం, ఇలా దాడి చేయకండి...

Read: న్యూజిలాండ్ విజయం వెనక ఎమ్మెస్ ధోనీ... కెప్టెన్ కూల్ విన్నింగ్ ఫార్మాలాతోనూ కెప్టెన్ ఐస్...

చాలా పాక్ అభిమానులు, నేను భారతీయులు కావడంతో లక్కీ కాదని, ఇండియన్ ఏజెంట్‌నని భావిస్తున్నారు. కానీ అది నిజం కాదు. హసన్ ఆలీ ఆ క్యాచ్ డ్రాప్ చేసినందుకు చాలా బాధపడుతున్నాడు, కృంగిపోతున్నాడు. కానీ మ్యాచ్ తర్వాత నేను, దుబాయ్‌లో ఉన్న, పాకిస్తాన్‌లో ఉన్న మా కుటుంబాన్ని చంపేస్తామని బెదిరింపులు వస్తున్నాయి.. ’ అంటూ వరుస ట్వీట్లు చేసింది సమీయా అర్జో...
 

click me!