T20 Worldcup 2021: అదరగొట్టిన ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్... స్కాట్లాండ్ ముందు భారీ టార్గెట్...

By Chinthakindhi RamuFirst Published Oct 25, 2021, 9:17 PM IST
Highlights

Afghanistan vs Scotland: నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ స్కోరు చేసిన ఆఫ్ఘాన్... పసికూన స్కాట్లాండ్ ముందు...

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీని ఆఫ్ఘాన్ అదిరిపోయే రేంజ్‌లో ఆరంభించింది. క్వాలిఫైయర్స్‌లో గ్రూప్ టాపర్‌గా నిలిచిన స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆఫ్ఘాన్, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 190 పరుగుల భారీ స్కోరు చేసింది... ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇదే అత్యధిక స్కోరు...టీ20 వరల్డ్‌కప్ టోర్నీలోనూ ఆఫ్ఘాన్‌కి ఇదే అత్యుత్తమ స్కోరు. ఇంతకుముందు 2016 టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో జింబాబ్వేపై 186 పరుగులు చేసింది ఆఫ్ఘాన్... 

మొదటి ఓవర్‌లో కేవలం 2 పరుగులు మాత్రమే రాగా, రెండో ఓవర్‌ నుంచి బాదుడు మొదలెట్టాడు హజ్రతుల్లా జజాయ్, మహ్మద్ షాజద్... రెండో ఓవర్‌లో 18 పరుగులు రాగా, ఆ తర్వాతి ఓవర్‌లో మళ్లీ రెండే పరుగులు వచ్చాయి. ఆ తర్వాత ఓపెనర్లు ఇద్దరూ గేర్ మార్చడంతో 5.1 ఓవర్లలోనే టీమ్ స్కోరు 50 పరుగులు దాటింది. ఈ టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో ఇదే అత్యంత పాసెస్ట్ ఫిఫ్టీ...

Latest Videos

must READ: ఇండియా ఓడిందని మనవాళ్లే టపాసులు కాల్చారు, దీపావళి రోజు కాలిస్తే తప్పేంటి... సెహ్వాగ్ ట్వీట్...

15 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన మహ్మద్ షాజద్, సప్యాన్ షరఫ్ బౌలింగ్‌లో క్రిస్ గ్రేవ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 54 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆఫ్ఘాన్... 30 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 44 పరుగులు చేసిన హజ్రతుల్లా జజాయ్, మాథ్యూ వాట్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 82 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది ఆఫ్ఘాన్...

ఆ తర్వాత నజీబుల్లా జడ్రాన్, రహ్మనుల్లా గుర్బాజ్ కలిసి స్కాట్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డారు... ఈ ఇద్దరూ కలిసి 52 బంతుల్లో 87 పరుగుల భాగస్వామ్యం నమోదుచేశారు. 37 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసిన గుర్భాజ్, డావే బౌలింగ్‌లో భారీ షాట్‌కి ప్రయత్నించి పెవిలియన్ చేరాడు...

Read also: IPL AUCTION: 2022 ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే... అహ్మదాబాద్, లక్నో నగరాల పేర్లతో...

మహ్మద్ నబీ కూడా వస్తూనే బౌండరీలు బాదాడు. నబీ తాను ఆడిన నాలుగు బంతుల్లో 2 ఫోర్లతో 11 పరుగులు చేయగా జడ్రాన్ 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆఖరి బంతికి అవుట్ అయ్యాడు... 

ఇవి కూడా చదవండి: ఇతన్నేనా మిస్టరీ స్పిన్నర్ అంటూ దాచారు, తనకంటే పదో క్లాస్ పిల్లలే నయం... పాక్ మాజీ పేసర్ కామెంట్స్...

రోహిత్ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండి ఉంటే, ఈపాటికి ఎలా... పాకిస్తాన్‌తో మ్యాచ్‌పై విరాట్ ఫ్యాన్స్... అతన్ని ఆడించడమే టీమిండియా చేసిన అతి పెద్ద తప్పు... ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ కామెంట్స్..

నాగబాబును వదలని నెటిజన్లు... మీరెక్కడ తయారయ్యారు బాబూ, మ్యాచ్ చూడడం కూడా తప్పేనా...

నీ వల్లే మ్యాచ్ ఓడిపోయాం, కావాలని పాక్‌ని గెలిపించావ్... టీమిండియా ఓటమి తర్వాత మహ్మద్ షమీపై తీవ్రమైన...

click me!