Virat Kohli Birthday : క్యాండిల్ ఊదడం మర్చిపోయి కేక్ కట్ చేసిన కోహ్లీ.. వీడియో వైరల్..!

By telugu news teamFirst Published Nov 6, 2021, 9:59 AM IST
Highlights

మొత్తం 42సెకన్ల వీడియో లో టీమిండియా క్రికెటర్లు మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా లు కనపడుతున్నారు. కాగా.. కోహ్లీ..  క్యాండిల్స్ ఊదడం మర్చిపోవడంతో.. వాళ్లంతా నవ్వడం విశేషం.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ( Virat kohli) 33వ పుట్టిన రోజు జరుపుకున్నారు. శుక్రవారం కోహ్లీ పుట్టిన రోజు జరుపుకున్నారు. కాగా.. ఈ సందర్భంగా ఆయన టీమిండియా సభ్యులంతా కలిసి బర్త్ డే సెలబ్రేట్ చేశారు. ఆ సమయంలో కోహ్లీ.. కేక్ కట్ చేయడానికి ముందు..క్యాండిల్స్ ఊదడం మర్చిపోయాడు. ఆ విషయాన్ని కోహ్లీకి.. పక్కనే ఉన్న టీమిండియా మాజీ కెప్టెన్, మెంటార్ మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni) గుర్తు చేయడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.

మొత్తం 42సెకన్ల వీడియో లో టీమిండియా క్రికెటర్లు మహ్మద్ షమీ, ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా లు కనపడుతున్నారు. కాగా.. కోహ్లీ..  క్యాండిల్స్ ఊదడం మర్చిపోవడంతో.. వాళ్లంతా నవ్వడం విశేషం.

 

Cake, laughs and a win! 🎂 😂 👏 bring in captain 's birthday after their superb victory in Dubai. 👍 👍 pic.twitter.com/6ILrxbzPQP

— BCCI (@BCCI)

ఈ వీడియోని బీసీసీఐ తమ ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడం గమనార్హం.  టీ20 వరల్డ్ కప్ లో భాగంగా..స్కాంట్లాండ్ తో టీమిండియా తలపడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా స్కాట్లలాండ్ ని చిత్తు చేసింది. ఈ మ్యాచ్ విజయం త ర్వాత.. కోహ్లీ పుట్టిన రోజు వేడకలు నిర్వహించారంటూ బీసీసీఐ పేర్కొంది.

టీ20 ప్రపంచకప్‌ సెమీస్‌లో అడుగుపెట్టాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లో రాణించిన భారత్‌.. స్కాట్లాండ్‌పై అలవోకగా నిలిచి సెమీస్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. స్కాట్లాండ్ నిర్దేశించిన 86 పరుగుల లక్ష్యాన్ని భారత్‌ రెండు వికెట్లు కోల్పోయి కేవలం 6.3 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు కేఎల్ రాహుల్‌ (50), రోహిత్ శర్మ (30) ధాటిగా ఆడి తొలి వికెట్‌కు 70 పరుగులు జోడించారు. 

అయితే విజయానికి కొద్ది పరుగుల దూరంలో రోహిత్‌ ఔటయ్యాడు. ఇక లక్ష్య ఛేదనకు నాలుగు పరుగులు చేయాల్సిన తరుణంలో కేఎల్‌ రాహుల్‌ భారీ షాట్‌ ఆడి పెవిలియన్ చేరాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ (2 నాటౌట్), సూర్యకుమార్‌ యాదవ్‌ (6 నాటౌట్ ) లాంఛనాన్ని పూర్తి చేసేశారు. దీంతో పాయింట్ల పట్టికలో భారత్‌ (4 పాయింట్లు) మూడో స్థానానికి ఎగబాకింది. అయితే భారత్ సెమీస్ చేరాలంటే నవంబర్ 8న నమీబియాతో జరిగే మ్యాచ్‌లోనూ భారీ విజయం సాధించడంతో పాటు రేపు ఆఫ్ఘనిస్తాన్- న్యూజిలాండ్‌ల మధ్య జరిగే మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ గెలవాల్సి వుంటుంది. ప్రస్తుతం భారత లంతా ఆఫ్ఘన్ గెలవాలని కోరుకుంటున్నారు.

అంతకుముందు టాస్‌ నెగ్గిన భారత కెప్టెన్ కోహ్లీ బౌలింగ్‌ ఎంచుకుని స్కాట్లాండ్‌కు బ్యాటింగ్‌ అప్పగించాడు. భారత బౌలర్ల ధాటికి స్కాట్లాండ్‌ 17.4 ఓవర్లలో 85 పరుగులకే ఆలౌట్ అయ్యింది. స్కాట్లాండ్‌ బ్యాట్స్‌మెన్లలో జార్జ్‌ మున్సీ (24), లీస్క్‌ (21) రాణించారు. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ముగ్గురు డకౌట్‌గా వెనుదిరిగారు. కెప్టెన్‌ కోట్జర్‌ (1), క్రాస్‌ (2), గ్రీవ్స్‌ (1)లు సైతం సింగిల్‌ డిజిట్‌కే పరిమితయ్యారు. మెక్‌లాయిడ్‌ 16, వాట్‌ 24 పరుగులు చేశారు. భారత బౌలర్లలో షమీ 3, జడేజా 3, బుమ్రా 2, అశ్విన్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. 

click me!