T20 World Cup: ఒకే ఓవ‌ర్ లో 36 ప‌రుగులు.. యువ‌రాజ్ సింగ్ రికార్డు స‌మం చేశాడు

By Mahesh RajamoniFirst Published Jun 18, 2024, 11:38 PM IST
Highlights

Nicholas Pooran equals Yuvraj Singh's record: టీ20 ప్రపంచ కప్ 2024లో చివ‌రి లీగ్ మ్యాచ్ లో వెస్టిండీస్ స్టార్ ప్లేయ‌ర్ నికోల‌స్ పూర‌న్ ఆఫ్ఘనిస్తాన్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడుకున్నాడు. ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ తో క్రిస్ గేల్ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డంతో పాటు టీమిండియా ఆల్ రౌండ‌ర్ యువ‌రాజ్ సింగ్ రికార్డును స‌మం చేశాడు. 
 

Nicholas Pooran equals Yuvraj Singh's record : గ్రాస్ ఐలెట్‌లోని డారెన్ సమీ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్ సీ మ్యాచ్‌లో వెస్టిండీస్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ విధ్వంసం సృష్టించాడు. దిగ్గ‌జ ప్లేయ‌ర్లు క్రిస్ గేల్, యువ‌రాజ్ సింగ్ ల స‌ర‌స‌న చేరాడు. ఒకే ఓవర్‌లో 36 పరుగులు చేసి చరిత్ర సృష్టించాడు నికోల‌స్ పూర‌న్. టీ20 క్రికెట్ చరిత్రలో ఒక ఓవర్‌లో 36 పరుగులు చేయడం ఇది ఐదో సారి. బ్యాట్‌తో 26 పరుగులు చేసిన పూరన్‌కు వెస్టిండీస్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్‌లో ఆఫ్ఘనిస్తాన్ ఆల్ రౌండర్ అజ్మతుల్లా ఒమర్జాయ్ వేసిన ఐదు వైడ్‌లు, నాలుగు లెగ్ బైలు, ఒక నో బాల్ తో ఈ ప‌రుగులు వ‌చ్చాయి.

ఈ ఓవ‌ర్ ను ఒమర్జాయ్ పూర్తి, వైడ్ డెలివరీతో ప్రారంభించాడు. పూరన్ థర్డ్ మ్యాన్ మీదుగా సిక్సర్ కొట్టగలిగాడు. ఫోర్ కొట్టిన తర్వాతి బంతికి రైట్ ఆర్మ్ పేసర్ ఓవర్ స్టెప్ చేశాడు. అతని తర్వాతి బంతి ఐదు వైడ్‌లకు వెళ్లడంతో ఓవ‌ర్ లో మ‌రిన్ని ప‌రుగులు వ‌చ్చాయి.  కీపర్ తలపైకి వెళ్లే ప్రయత్నం చేసిన బౌన్సర్ కావ‌డంతో ఫ్రీ-హిట్ వ‌చ్చింది. దీంతో పాటు ఓవర్ మూడో బాల్ పూరన్ ప్యాడ్‌లను క్లిప్ చేసి, కీపర్‌ను ఫోర్ లెగ్ బైస్‌కి వెళ్లింది. ఇక ఓవర్‌లోని మిగిలిన మూడు బంతుల్లో ఒక ఫోర్, రెండు సిక్స‌ర్ల‌తో ఓవ‌ర్ ను ముగించాడు. 

Latest Videos

టీ20 ప్రపంచకప్ 2026లో ఆడ‌బోయే క్రికెట్ జ‌ట్లు ఏవో తెలుసా?

దీంతో కరీం జనత్ తర్వాత టీ20లో ఒక ఓవర్‌లో 36 పరుగులు ఇచ్చిన రెండో ఆఫ్ఘనిస్తాన్ బౌలర్‌గా ఒమర్జాయ్ చెత్త రికార్డు న‌మోదుచేశాడు. ఈ ఏడాది ఆరంభంలో భారత్‌కు చెందిన రోహిత్ శర్మ, రింకూ సింగ్‌ల బ్యాటింగ్ స‌మ‌యంలో జనత్ 36 పరుగులు ఇచ్చుకున్నాడు. 

టీ20ల్లో ఒక ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయ‌ర్లు

  • 36 - యువరాజ్ సింగ్ (ఇండియా) vs స్టువర్ట్ బ్రాడ్ (ఇంగ్లండ్), డర్బన్, 2007
  • 36 - కీరన్ పొలార్డ్ (వెస్టిండీస్) vs అకిల దనంజయ (శ్రీలంక‌), కూలిడ్జ్, 2021
  • 36 - రోహిత్ శర్మ & రింకు సింగ్ (ఇండియా) vs కరీం జనత్ (ఆఫ్ఘ‌నిస్తాన్), బెంగళూరు, 2024
  • 36 - దీపేంద్ర సింగ్ ఐరీ (నేపాల్) vs కమ్రాన్ ఖాన్ (ఖత‌ర్), అల్ అమెరత్, 2024
  • 36 - నికోలస్ పూరన్ & జాన్సన్ చార్లెస్ (వెస్టిండీస్) vs అజ్మతుల్లా ఒమర్జాయ్ (ఆఫ్ఘ‌నిస్తాన్), సెయింట్ లూసియా, 2024

ఈ మ్యాచ్ లో 8 సిక్సర్లు కొట్టి క్రిస్ గేల్ రికార్డును బద్దలు కొట్టాడు నికోల‌స్ పూర‌న్. గేల్ 124 సిక్స‌ర్లు కొట్ట‌గా, పూరన్ ఇప్ప‌టివ‌ర‌కు 128 టీ20 సిక్సర్లు బాదాడు. అలాగే, పురుషుల టీ20ల్లో 500కు పైగా సిక్సర్లు బాదిన ఆరో బ్యాటర్‌గా కూడా నికోల‌స్ పూరన్ ఘ‌న‌త సాధించాడు. ఆఫ్ఘ‌న్ పై అత‌ను 53 బంతుల్లో 8 సిక్సర్లు, ఆరు ఫోర్లతో 98 పరుగుల ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ ఆడాడు. చివ‌ర‌లో రనౌట్ కార‌ణంగా సెంచ‌రీని కోల్పోయాడు. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ 20 ఓవర్లలో 218/5 భారీ స్కోరు చేయ‌గా, ఆఫ్ఘనిస్థాన్ 114 ప‌రుగుల‌కే ఆలౌట్ అయింది.

T20 World Cup 2024 సూప‌ర్-8 మ్యాచ్‌లకు ముందు టీమిండియాకు బిగ్ షాక్..

click me!