టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024: భారత పేసర్ మ‌హ్మ‌ద్ ష‌మీ పై జహీర్ ఖాన్ కామెంట్స్ వైరల్..

By Mahesh Rajamoni  |  First Published Jan 19, 2024, 9:29 PM IST

T20 World Cup 2024: టీమిండియా స్టార్ బౌలర్ గాయం కారణంగా ఇటీవల జరిగిన దక్షిణాఫ్రికా, ఆఫ్ఘ‌నిస్తాన్ సిరీస్ ల‌కు దూర‌మ‌య్యాడు. ఐసీసీ క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో అద‌ర‌గొట్టిన ష‌మీ.. రాబోయే టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024లో భార‌త జ‌ట్టుకు ఎక్స్-ఫాక్టర్ బౌలర్ అవుతాడని టీమిండియా మాజీ ఫాస్ట్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్ అన్నారు.
 


Zaheer Khan - Mohammed Shami: రాబోయే టీ20 వ‌రల్డ్ క‌ప్-2024కు ముందు ఆఫ్ఘ‌నిస్తాన్ తో భార‌త్ త‌న చివ‌రి టీ20 సిరీస్ ను ఆడింది. అయితే, గ‌తేడాది జ‌రిగిన ఐసీసీ వ‌న్డే క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ 2023లో అద‌ర‌గొట్టిన టీమిండియా స్టార్ బౌల‌ర్ గాయం కార‌ణంగా ఈ సిరీస్ కు అందుబాటులో ఉండ‌లేక‌పోయాడు. అయితే, ప్ర‌స్తుతం అత‌ను ఫిట్ గా ఉన్నాడ‌నీ, రాబోయే భార‌త సిరీస్ ల‌కు అందుబాటులో ఉంటాడ‌ని బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే భార‌త మాజీ స్టార్ బౌల‌ర్ జ‌హీర్ ఖాన్ మాట్లాడుతూ మ‌హ్మ‌ద్ ష‌మీపై కీల‌క వ్యాఖ్య‌లు చేశాడు.

మొహమ్మద్ షమీ పూర్తి ఫిట్‌గా ఉండి, రాబోయే ఐసీసీ టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024కు అందుబాటులో ఉంటే, అతను భారత జట్టుకు ఎక్స్-ఫాక్టర్ బౌలర్ అవుతాడని మాజీ ఫాస్ట్ బౌలర్ జహీర్ ఖాన్ పేర్కొన్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ టోర్నీలో మహమ్మద్ షమీ భారత జట్టు అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. భారత్ తరఫున ప్రారంభంలో ప‌లు మ్యాచ్ ల‌కు బెంచ్ కే ప‌రిమితం అయ్యాడు. అయితే, హార్ధిక్ పాండ్యా గాయం కార‌ణంగా తుదిజ‌ట్టులో చోటుద‌క్కించుకున్న ష‌మీ.. త‌న అద్భుత‌మైన బౌలింగ్ ప్ర‌త్య‌ర్థి బ్యాట‌ర్స్ కు చుక్క‌లు చూపించాడు. ఆడిన‌ 7 మ్యాచ్‌లలో 24 వికెట్లు పడగొట్టాడు. మెగా టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

Latest Videos

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ-ఫైనల్‌లో మహ్మద్ షమీ 7 వికెట్లు తీసి త‌న బౌలింగ్ ప‌దును ఎంటో చెప్పాడు. త‌న కెరీర్ లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ ప్రదర్శన. అలాగే, వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యుత్తమ బౌలింగ్ కూడా. అంతేకాదు వన్డే ప్రపంచకప్ చరిత్రలో మహ్మద్ షమీ 50 వికెట్లు పడగొట్టాడు. అతను కేవలం 17 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించిన బౌల‌ర్ చ‌రిత్ర సృష్టించాడు. అయితే, వన్డే ప్రపంచకప్ టోర్నీ సందర్భంగా చీలమండ గాయానికి గురైన మహ్మద్ షమీ అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌కు అందుబాటులో ఉండ‌లేదు.

ఒక మీడియా సంస్థ‌తో జహీర్ ఖాన్ మాట్లాడుతూ.. రాబోయే T20 ప్రపంచ కప్ భారత జట్టులో త‌ప్ప‌కుండా ఉండాల్సిన బౌల‌ర్ గా మహ్మద్ షమీని ఎంపిక చేశాడు. అత‌నితో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అర్ష్ దీప్ సింగ్ ల‌ను కూడా భార‌త జ‌ట్టులో ఉండాల‌ని పేర్కొన్నాడు. "జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ టీ20 ప్రపంచ కప్‌లో ఆడటం ఖాయమని నేను భావిస్తున్నాను. వారి తర్వాత, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఆడగలడు ఎందుకంటే అతని బౌలింగ్‌లో కొంత స్వింగ్.. కొన్ని యార్కర్లు ఉంటాయి. ఇది అతనికి ప్లస్ పాయింట్" అని జహీర్ ఖాన్ అన్నారు.

సచిన్ టెండూల్కర్ రికార్డుపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ, జో రూట్ !

టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఎక్స్ ఫ్యాక్టర్ ప్లేయర్‌గా ష‌మీని ఎంపిక చేశాడు జ‌హీర్ ఖాన్. మహ్మద్ షమీ పూర్తిగా ఫిట్‌గా ఉండి ఎంపికకు అందుబాటులో ఉంటే భారత జట్టుకు ఎక్స్‌ఫాక్టర్‌గా నిలుస్తాడని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. "నేను మొహమ్మద్ షమీని నమ్ముతున్నాను ఎందుకంటే అతను పూర్తి ఫిట్‌నెస్ పొంది, టీ20 ప్రపంచకప్‌కు అందుబాటులో ఉంటే, అతను భారత జట్టుకు ఎక్స్-ఫాక్టర్ బౌలర్ అవుతాడు. కాబట్టి నేను ఈ నలుగురు బౌలర్లను టీమిండియాకు ఎంపిక చేస్తాను" అని భారత మాజీ పేసర్ జ‌హీర్ ఖాన్  చెప్పాడు.

భార‌త్ కు కంగారుల స‌వాల్.. రోహ‌త్ శ‌ర్మ సేన WTC రేసులో నిలుస్తుందా? మరో ట్విస్ట్ !

click me!