MS Dhoni fan: క్రికెట్ దిగ్గజం, టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని (ఎంఎస్ ధోని) వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. 2020లో చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ను తలపించేలా తన ఇంటిని పసుపు కలర్ వేయడంతో పాటు ఆ ఇంటికి 'ధోని ఫ్యాన్ ఇల్లు' అని పేరు పెట్టుకుని వెలుగులోకి వచ్చాడు.
MS Dhoni fan Gopi Krishnan: టీమిండియా మాజీ కెప్టెన్, చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ వీరాభిమాని ఆత్మహత్య చేసుకున్నాడు. ధోనీ అభిమాని తన ఇంటికి చెన్నై సూపర్ కింగ్స్ పసుపు రంగు పెయింట్ వేయడంతో పాటు ధోని చిత్రం కలర్ పెయింట్స్ ను తన ఇంటిపై వేసి, దానికి 'ధోనీ అభిమాని ఇల్లు' అని పేరుపెట్టాడు. 2020లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాడు. ధోని డైహార్డ్ ఫ్యాన్ గా గుర్తింపు పొందాడు. అయితే, ధోనీ వీరాభిమాని గోపీకృష్ణ అనుమానస్పదంగా ప్రాణాలు కోల్పోయారు.
తమిళనాడులోని అరంగూర్ లోని ఓ ఇంట్లో ధోనీ వీరాభిమాని అయిన గోపీకృష్ణ అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ధోనీ అభిమాని పేరు గోపీ కృష్ణ మృతి ఆత్మహత్య అనీ, దీని వెనుక ఆర్థిక సమస్యలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. అలాగే, ఈ కేసులో పాత కక్షలు కారణంగా ఉండే అవకాశం ఉందని రామతం పోలీసు అధికారి ఒకరు తెలిపినట్టు ఇండియన్ ఎక్స్ ప్రెస్ నివేదించింది. తెల్లవారు జామున 4.30 గంటల ప్రాంతంలో కృష్ణన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ధోని డైహార్డ్ ఫ్యాన్ గోపీ కృష్ణ మరణంపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తన సోదరుడికి పక్క గ్రామానికి చెందిన కొందరితో డబ్బుల విషయంలో వివాదం ఉందని గోపీకృష్ణ సోదరుడు పేర్కొంటున్నారు. ఇటీవల కృష్ణన్ కూడా అతనితో గొడవపడి గాయపడ్డాడు. దీంతో ఆయన చాలా బాధపడ్డారని ఆయన సోదరుడు తెలిపారు. రామనాథం పోలీసులు అసహజ మృతిగా కేసు నమోదు చేశారు.
కాగా, 2022లో ధోనీ అభిమాని వీడియో వైరల్ కావడం అంత ఈజీగా జరగలేదు. గోపీ కృష్ణ తన కుటుంబ సభ్యులను ఒప్పించి, ఇంటి మొత్తానికి పసుపు రంగు కలర్ వేయించారు. అలాగే, ఇంటిపై చెన్నై సూపర్ కింగ్స్ లోగోలు, ఎంఎస్ ధోని చిత్రాలను వేయించారు. ఇంటికి ధోని అభిమాని ఇల్లుగా పేరు పెట్టారు. ఆ తర్వాత ఇంటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. దీని గురించి గోపీకృష్ణ కుటుంబం మాట్లాడుతూ.. తమ కుటుంబం మొత్తం ధోనీకి వీరాభిమాని అనీ, వారి సహకారంతోనే కృష్ణ ఆ ఇంటికి సీఎస్కే రంగులు వేసి ధోనీ పేరు పెట్టినట్టు తెలిపారు. కృష్ణన్ తన వైరల్ వీడియోలో మొత్తం కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు.
Super Fan Gopi Krishnan and his family in Arangur, Tamil Nadu call their residence Home of Dhoni Fan and rightly so. 🦁💛
A super duper tribute that fills our hearts with . pic.twitter.com/WPMfuzlC3k
కృష్ణన్ పై ధోనీ ప్రశంసలు..
కృష్ణన్ వైరల్ వీడియో ఎంఎస్ ధోనీకి చేరింది. తన పై ఇలా అభిమానం చాటుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన ధోని.. కృష్ణన్ తన ఇంటికి పసుపు రంగు పూయడం, ఆ ఇంటికి తన పేరు పెట్టడం చూసిన చెప్పలేని సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కృష్ణన్ అద్భుత పని అని ధోనీ కొనియాడాడు.