సచిన్ టెండూల్కర్ రికార్డుపై క‌న్నేసిన విరాట్ కోహ్లీ, జో రూట్ !

By Mahesh RajamoniFirst Published Jan 19, 2024, 2:02 PM IST
Highlights

India vs England: జనవరి 25 నుండి భారత్-ఇంగ్లాండు మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సీరిస్ ను సొంతం చేసుకుని డ‌బ్లూటీసీ రేసులో స్థానం సుస్థిరం చేసుకోవాల‌ని భారత్ చూస్తోంది. ఇదే సిరీస్ లో స్టార్ క్రికెట‌ర్లు జో రూట్, విరాట్ కోహ్లీలు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్ట‌డంపై క‌న్నేశారు.
 

India vs England Test Series: ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) మూడో ఎడిషన్ లో భాగంగా జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు సిరీస్ మొద‌లుకానుంది. ఈ సిరీస్ లో మొత్తం ఐదు మ్యాచ్ లు ఆడ‌నున్నాయి. అయితే, సిరీస్ లో ప‌లు క్రికెట్ రికార్డులు బ‌ద్ద‌లు కానున్నాయి. ముఖ్యంగా ఇరు జ‌ట్ల‌ స్టార్ ప్లేయ‌ర్లు విరాట్ కోహ్లీ, జో రూట్ లు క్రికెట్ గాడ్, మాస్ట‌ర్ బ్లాస్ట‌ర్ స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డుపై క‌న్నేశారు. ఆఫ్ఘ‌నిస్తాన్ తో టీ20 సిరీస్ కు ముందు దక్షిణాఫ్రికాతో భార‌త్ టెస్టు సిరీస్ ఆడింది. రెండు మ్యాచ్ ల‌ టెస్టు సిరీస్ ను 1-1తో సమం చేసింది రోహిత్ శర్మ నాయ‌క‌త్వంలోని టీమిండియా. దీంతో 2023-25 ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ పాయింట్ల పట్టికలో భార‌త్ రెండో స్థానానికి పడిపోయింది. ఇక ఇంగ్లాండు స్వదేశంలో ప్రతిష్టాత్మక యాషెస్ టెస్టు సిరీస్ ను ఇంగ్లాండ్ 2-2తో సమం చేసింది. రానున్న ఐదు మ్యాచ్ టెస్టు సిరీస్ లో భార‌త్-ఇంగ్లాండ్ లు గెలుపే ల‌క్ష్యంగా పెట్టుకున్నాయి.

టెండూల్క‌ర్ రికార్డుకు గురిపెట్టిన కోహ్లీ, జోరూట్

Latest Videos

జనవరి 25 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగే టెస్టు సిరీస్ లో అత్యధిక పరుగులు చేసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (2,535 పరుగులు) రికార్డును బద్దలు కొట్టాలని ఇంగ్లాండ్ స్టార్ జో రూట్, భారత దిగ్గజం విరాట్ కోహ్లీ భావిస్తున్నారు. 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ టెస్టు సిరీస్ లో జో రూట్ 9 ఇన్నింగ్స్ ల‌లో 412 పరుగులు చేశాడు. రెడ్ బాల్ క్రికెట్ లో భారత్ పై సూప‌ర్ రికార్డు ఉన్న జోరూట్ అదే జోరును కొన‌సాగించాల‌ని చూస్తున్నాడు. స్వదేశంలో భారత్ పై 9 టెస్టు ఇన్నింగ్స్ ల్లో 50.10 సగటుతో 2 సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలతో 952 పరుగులు చేసి జోరూట్ 1000 పరుగుల మైలురాయిని అందుకోనున్నాడు.

భార‌త్ కు కంగారుల స‌వాల్.. రోహ‌త్ శ‌ర్మ సేన WTC రేసులో నిలుస్తుందా? మరో ట్విస్ట్ !

భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన టెస్టు సిరీస్ ల‌లో అత్యధికంగా 9 సెంచరీలు చేసిన ఆటగాడిగా జో రూట్ రికార్డు సృష్టించాడు. అత‌ని త‌ర్వాత‌ సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, అలెస్టర్ కుక్ చెరో ఏడు సెంచరీలు సాధించారు. విరాట్ కోహ్లీ 5 సెంచరీలు చేశాడు. కాగా, ఇంగ్లాండ్ పై 50 ఇన్నింగ్స్ లు ఆడి 1,991 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ 2000 పరుగుల మైలురాయిని ద‌గ్గ‌ర‌గా ఉన్నాడు. ఈ సిరీస్ లో కోహ్లీ మ‌రో 9 ప‌రుగులు చేస్తే ఇంగ్లాండు పై భారత త‌ర‌ఫున 2000 ప‌రుగులు చేసిన ఆటగాళ్ల లిస్టులో చేరుతాడు. అలాగే, స‌చిన్ టెండూల్క‌ర్ రికార్డును కూడా బ్రేక్ చేసే అవకాశం జోరూట్, విరాట్ కోహ్లీల‌కు ఉంది. ఇండియా-ఇంగ్లాండ్ మ‌ధ్య జ‌రిగిన టెస్టు సిరీస్ ల‌లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా స‌చిన్ టెండూల్క‌ర్ టాప్ లో ఉన్నారు.

విరాట్ జంపింగ్.. బుమ్రా బౌలింగ్ ! మ్యాచ్‌ని మలుపు తిప్పిన కింగ్ కోహ్లీ.. !

భారత్- ఇంగ్లాండ్ మధ్య సిరీస్ ల‌లో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆటగాళ్లు

స‌చిన‌ట్ టెండూల్క‌ర్ - 2,535 పరుగులు (53 ఇన్నింగ్స్)
జో రూట్ - 2,526 పరుగులు (45 ఇన్నింగ్స్) 
సునీల్ గవాస్కర్ - 2,483 పరుగులు (67 ఇన్నింగ్స్)
అలెస్టర్ కుక్ - 2,431 పరుగులు (54 ఇన్నింగ్స్)
విరాట్ కోహ్లీ - 1,991 పరుగులు (50 ఇన్నింగ్స్) 

విరాట్ కోహ్లీ కౌగిలితో జైలుకు.. బ‌య‌ట‌కువ‌చ్చిన అభిమానికి ఘనస్వాగతం.. వైర‌ల్ వీడియో !

click me!