T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ 2024 ఘనంగా ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో సహ-ఆతిథ్య అమెరికా కెనడాను చిత్తు చేసి తొలి విజయం అందుకుంది. రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ తో పపువా న్యూ గినియా తలడనుంది.
T20 World Cup 2024 : టీ20 వరల్డ్ కప్ 2024 లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతున్న జట్లలో అతిథ్య దేశం వెస్టిండీస్ కూడా ఉంది. టీ20 ప్రపంచ కప్ తొలి మ్యాచ్‌లో సహ-ఆతిథ్య అమెరికా కెనడాను చిత్తు చేసి తొలి విజయం అందుకుంది. రెండో మ్యాచ్ లో వెస్టిండీస్ తో పపువా న్యూ గినియా తలడనుంది. ఈ మ్యాచ్ లో వెస్టిండీస్ కు బలమైన ప్రత్యర్థిగా పపువా న్యూ గినియా చూడలేము. ఎందుకంటే విండీస్ టీమ్ లో బిగ్ హిట్టర్లు.. ఫాస్ట్ బౌలర్లు, అథ్లెటిక్ ఫీల్డర్లు ఉన్నారు. టీ20 క్రికెట్ లో తమదైన ముద్రవేస్తూ అదరగొడుతున్న స్టార్లు ఉన్నారు.
అలాగే, వెస్టిండీస్ రెండుసార్లు టీ20 ప్రపంచ ఛాంపియన్లు. అయితే, ఫ్రాంచైజీలలో వారి ప్రపంచ ఆకర్షణ, ఈ ఫార్మాట్ ను అనుసరించే విధానాన్ని ముందుకు తీసుకెళ్లడంలో మరింత ఆధిపత్యం కలిగి ఉండాలి. 2024లో సహ ఆతిథ్య జట్టుగా ప్రపంచ ర్యాంకింగ్స్ లో తమ స్థానం ఉన్నప్పటికీ తమకు ఉన్న ఖ్యాతిని ఎందుకు మోస్తున్నామో నిరూపించుకోవాలని మరోసారి భావిస్తోంది. వీరికి పోటీగా పపువా న్యూగినియా పెద్ద ప్రత్యర్థి కాదు కానీ, విండీస్ ఒక్కోసారి బోల్తాకొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
"భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంచనాలు-హైప్ భయాన్ని కలిగిస్తున్నాయి.."
అలా జరిగితే ఆశ్చర్యపోనవసరం లేదు. పపువా న్యూ గినియా లో పెద్దపెద్ద స్లార్లు లేకపోవచ్చు కానీ ప్రపంచ వేదికలపై అనుభవం వారికి ఆందోళన కలిగించే విషయం కాదు. సమూహంలోని మరో అసోసియేట్ ఉగాండాపై పైచేయి సాధించడానికి చేసిన కృషి గుర్తుచేసుకోవాలి. ఊహించని విధంగా ఒకవేళ పపువా న్యూ గినియా మ్యాజిక్ చేస్తే వెస్టిండీస్ తదుపరి రౌండ్ కు అర్హత అవకాశాలను చాలా ప్రమాదకరంగా మారుస్తుంది. బీజీ ఐపీఎల్ షెడ్యూల్ నేపథ్యంలో చాలా మంది ఆటగాళ్లు టోర్నమెంట్లోకి వస్తున్నారు. ఆ అనుభవం వారిని మంచి స్థానంలో ఉంచినప్పటికీ, స్వదేశంలో నెమ్మదిగా ఆడే పరిస్థితులకు త్వరగా అలవాటు పడాలి.
పిచ్ ఎలా ఉంటుంది?
వెస్టిండీస్ - పపువా న్యూ గినియా లు తమ తొలి మ్యాచ్ ప్రొవిడెన్స్ స్టేడియం, గయానాలో జరగనుంది. పిచ్ చాలా స్లోగా ఉంటుంది. మందకొడిగా సాగిన మైదానం, గత 13 ఏళ్లలో అంతర్జాతీయ క్రికెట్లో నమోదైన అత్యధిక స్కోరు 5 వికెట్లకు 169 పరుగులు. కాబట్టి భారీ స్కోర్లు రావడం కష్టమే. మ్యాచ్ సమయంలో చిరుజల్లులు కురిసి కొంత మేఘావృతమయ్యే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ఎండ ఉంటుందని వాతావరణ నివేదికలు పేర్కొంటున్నాయి. ఇరు జట్లు ఇప్పటి వరకు ఒక్క టీ20 కూడా ఆడలేదు. ఇప్పుడు ఎలా మ్యాచ్ జరగనుందనేది ఆసక్తికరంగా మారింది.
ఇరు జట్లు:
పాపువా న్యూ గినియా : టోనీ ఉరా, సెసే బావు, అసద్ వాలా(కెప్టెన్), లెగా సియాకా, హిరి హిరి, హిలా వారే, చాడ్ సోపర్, కిప్లిన్ డోరిగా(వికెట్ కీపర్), అలీ నావో, కబువా మోరియా, సెమో కమియా, జాక్ గార్డనర్, జాన్ కరికో, చార్లెస్ అమిని, నార్మన్ వనువా.
వెస్టిండీస్ జట్టు: బ్రాండన్ కింగ్, జాన్సన్ చార్లెస్ (వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, నికోలస్ పూరన్, రోవ్‌మన్ పావెల్ (కెప్టెన్), షిమ్రాన్ హెట్మెయర్, ఆండ్రీ రస్సెల్, రొమారియో షెపర్డ్, అకేల్ హోసిన్, గుడాకేష్ మోటీ, అల్జారీ జోసెఫ్, షాయ్ హోప్, షెర్ మెక్‌కాయ్ రూథర్‌ఫోర్డ్, షమర్ జోసెఫ్.
INDIA VS IRELAND: టీ20 వరల్డ్ కప్ 2024లో ఐర్లాండ్ తో తొలి పోరుకు సై.. భారత్ రికార్డులు ఇవే