India vs Pakistan : వెస్టిండీస్, అమెరికా వేదికలుగా జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2024 లో గ్రూప్-ఏలో ఉన్న భారత్, పాకిస్థాన్ జట్లు జూన్ 9న న్యూయార్క్ లో తలపడనున్నాయి. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కెప్టెన్ బాబార్ ఆజం దాయాదుల పోరుపై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
T20 World Cup 2024 IND vs PAK : టీ20 సమరం మొదలైంది. ఇప్పుడు అందరి దృష్టి భారత్-పాకిస్తాన్ పోరుపైనే ఉంది. యావత్ క్రికెట్ ప్రపంచ ఎదురుచూసే భారత్ - పాకిస్తాన్ జట్లు టీ20 ప్రపంచకప్ లో భాగంగా జూన్ 9న న్యూయార్క్ లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో తలపడనున్నాయి. క్రీడా చరిత్రలోనే అతిపెద్ద పోటీల్లో ఇదొకటని చెప్పడంలో సందేహంలేదు. ఈ రెండు దేశాలతో పాటు చాలా దేశాలు దాయాదుల పోరు కోసం ఆసక్తిగా ఏదురుచూస్తుంటాయి.
ఈ క్రమంలోనే పీసీబీ పాడ్ కాస్ట్ లో పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ అజామ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. ''భారత్-పాక్ మ్యాచ్ మిగతా మ్యాచ్ ల కంటే ఎక్కువ చర్చను సృష్టిస్తుందని మాకు తెలుసు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారత్-పాక్ మ్యాచ్ గురించే మాట్లాడుకుంటూ ప్రతి ఒక్కరూ తమ దేశానికి మద్దతు పలుకుతున్నారు. ప్రతి అభిమాని మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తూ ఈ మ్యాచ్ పై దృష్టి పెడతాడని'' పేర్కొన్న బాబార్ ఆజం.. భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ పై ఉన్న అంచనాలు, హైప్ కొంత ఆందోళన, భయాన్ని కలిగిస్తున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశాడు.
T20 World Cup 2024 : రోహిత్ శర్మ ఫ్యాన్ ను చితకబాదిన యూఎస్ పోలీసులు..
అయితే ఒత్తిడి, భయాందోళనలను ఎలా ఎదుర్కోవాలో అనే విషయానలు కూడా బాబార్ ఆజం ప్రస్తావించాడు. బేసిక్స్ పై ఎంత ఎక్కువ దృష్టి పెడితే ఆటగాడిగా అంత సులువు అవుతుందనీ, ఇది విపరీతమైన ఒత్తిడితో కూడుకున్న ఆట అనీ, ప్రశాంతంగా ఉండి, మీ హార్డ్ వర్క్, స్కిల్స్ ను నమ్ముకుంటే పనులు సులువు అవుతాయని పేర్కొన్నాడు.
భారత్, పాకిస్థాన్ జట్లు గ్రూప్-ఏ లో ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఎలాగైన ట్రోఫీ గెలుచుకోవాలని చూస్తోందది. ఇయతే, ఇటీవల జరిగిన ప్రపంచకప్ ఎడిషన్లలో ఇరు జట్లు పేలవ ప్రదర్శన చూపాయి. 2007 లో ధోని కెప్టెన్సీ టైటిల్ గెలిచిన భారత్ అప్పటి నుంచి మళ్లీ టీ20 ప్రపంచ కప్ టైటిల్ ను అందుకోలేకపోయింది. ఇక పాకిస్థాన్ మూడు సెమీఫైనల్స్, రెండు ఫైనల్స్లో ఓడిపోయింది. కానీ వారికి అనుకూలంగా అద్భుతమైన రీబ్రాండింగ్ గణాంకాల ప్రకారం, వారు అన్ని టి 20 జట్లలో అత్యంత స్థిరంగా ఉన్నారు. అయితే, ఈ సారి భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది.
T20 WORLD CUP 2024 తొలి మ్యాచ్ లోనే కుమ్మేశారు.. ముందుముందు దబిడిదిబిడే.. !