Gautam Gambhir - Yuvraj Singh: రానున్న టీ20 వరల్డ్ కప్ 2024 లో భారత్ సత్తా చాటుతుందని పేర్కొన్న భారత జట్టు మాజీ స్టార్ ప్లేయర్ గౌతమ్ గంభీర్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు జట్లతోనే బిగ్ ఫైట్ ఉంటుందని తెలిపాడు.
T20 World Cup 2024: రానున్న ఐసీసీ క్రికెట్ టీ20 వరల్డ్ కప్ 2024 గురించి భారత జట్టు మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో పాకిస్తాన్ జట్టు తీరుపై విమర్శలు గుప్పించాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యంత చెత్త ఫీల్డింగ్ తో పాకిస్తాన్ దేనని పేర్కొన్నాడు. రాబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ లను వెస్టిండీస్, యూఎస్ఏలో నిర్వహించనున్నారు. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 లో భారత్ తన జైత్రయాత్రను కొనసాగించి.. ఫైనల్ లో ఓటమితో మెగా టోర్నీ కప్పును అందుకోలేక పోయింది. కానీ, 2023 టీ20 వరల్డ్ కప్ ను ఎలాగైన గెలుచుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2007 టీ20 ప్రపంచ కప్, ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2011టైటిళ్లను గెలుచుకున్న భారత టీమ్‌లలోని ఇద్దరు స్టార్ ప్లేయర్లు యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ ఒక ఒక టీవీ చర్చలో మాట్లాడుతూ రానున్న టీ20 వరల్డ్ కప్ లో భారత జట్టు అవకాశాలను గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు అతిపెద్ద ముప్పు ఎంటని ప్రశ్నించగా,యువరాజ్ సింగ్, గౌతమ్ గంభీర్ ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ జట్టు ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని పేర్కొంటూ ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండు జట్లతోనే బిగ్ ఫైట్ ఉంటుందని తెలిపాడు. "ఆ పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ చాలా ప్రమాదకరమైనది. అలాగే, ఆస్ట్రేలియా, ఎందుకంటే వారు ఎప్పుడైనా ప్రభావం చూపగల ఆటగాళ్లను కలిగి ఉంది. ఇంగ్లండ్ నుంచి కూడా.. టీ20 క్రికెట్‌ను ఆడాల్సిన విధంగా ఇంగ్లాండు ఆడుతుంది" అని గౌతమ్ గంభీర్ అన్నాడు.
undefined
మ్యాచ్ మధ్యలోనే గ్రౌండ్ లో ప్రేక్షకులతో కలిసి స్టెప్పులేసిన క్రికెటర్.. వీడియో వైరల్ !
ఇక యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. "నాకు భిన్నమైన అభిప్రాయం ఉంది. దక్షిణాఫ్రికా గెలిచే అవకాశాలు ఉన్నాయి. వారు వైట్-బాల్ టోర్నమెంట్‌ను గెలవలేదు. 50 ఓవర్ల ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శన చేశారు. అలాగే, స్పష్టంగా పాకిస్తాన్ కూడా చాలా ప్రమాదకరమైనది" అన్నాడు. ఇదే సమయంలో గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. "పాకిస్తాన్‌ను చూడండి, వారి ఫీల్డింగ్‌ను నేను వన్డే ప్రపంచకప్‌లో చూశాను. బహుశా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత చెత్త ఫీల్డింగ్ గా ఉంది. పాక్ నిజంగానే టీ20 ఫార్మాట్‌లో పోటీపడాలనుకుంటే ఈ విషయంలో తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుందని" అన్నారు. అలాగే, భారత్ ఇటీవలి టోర్నీల్లో చాలా సందర్భాల్లో ఫైనల్ చేరిందనీ, కానీ పాకిస్థాన్ అలాంటి పరిస్థితుల్లో లేదని అన్నారు. వన్డే వరల్డ్ కప్ 2023 లో ఒక్క అడుగు దూరంలో నిలిచిన భారత్ కు రానున్న టీ20 వరల్డ్ కప్ లో కప్పు కొడుతుందని గంభీర్ ఆశాభావం వ్యక్తంచేశాడు.
AUSTRALIA VS PAKISTAN: సెంచరీ మిస్.. మిచెల్ మార్ష్ హార్ట్ బ్రేక్..