ఏందీ సామీ ఇలా ఉన్నాయి.. ప్ర‌మాదాల‌ను పెంచుతున్న‌ అమెరికా 'డ్రాప్-ఇన్' పిచ్‌లు

By Mahesh Rajamoni  |  First Published Jun 6, 2024, 11:25 PM IST

T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా 9వ ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2024 జ‌రుగుతోంది. అయితే, అమెరికాలో ఏర్పాటు చేసిన డ్రాప్-ఇన్ పిచ్ ల‌పై క్రికెట్ వ‌ర్గాల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.
 


T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024 కు అమెరికా, వెస్టిండీస్ సంయుక్త వేదిక‌గాలుగా ఉన్నాయి. వెస్టిండీస్ క్రికెట్ స్టేడియాల‌లో విభిన్న ప‌రిస్థితుల గురించి అందిరికీ తెలిసిందే. అక్క‌డ ప‌రుగులు చేయ‌డం బ్యాట‌ర్స్ కు అంత సుల‌భం కాదు. అమెరికాలో ఇలాంటి ప‌రిస్థితులు ఉండ‌వ‌ని అంద‌రూ ఊహించారు కానీ, ఇప్పుడు ఇక్క‌డి పిచ్ ల‌పై ఆందోళ‌న, గంద‌ర‌గోళం నెల‌కొంది. మ‌రీ ముఖ్యంగా న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం పిచ్ కేవలం 2 మ్యాచ్‌లకే అనేక ప్ర‌శ్న‌ల‌ను తీసుకువ‌చ్చింది. ఇండియా-ఐర్లాండ్ మ్యాచ్‌లో పిచ్‌పై చాలా అసమాన బౌన్స్ క‌నిపించింది.

ఇది బ్యాటింగ్ దిగిన ప్లేయ‌ర్ల‌ను తీవ్రంగా ఇబ్బంది పెట్ట‌డంతో పాటు గాయాలకు కూడా కార‌ణ‌మైంది. భార‌త కెప్టెన్ రోహిత్ శర్మ తన చేతికి బంతి తగలడంతో మైదానం నుండి రిటైర్ అయ్యాడు. అంతే కాదు ఇదే మ్యాచ్‌లో రిషబ్ పంత్ కు కూడా చాలాసార్లు బంతికి తగిలింది. ఐర్లాండ్ బ్యాట్స్‌మెన్ కూడా బాల్ తో ఇబ్బంది ప‌డ్డారు. ప‌లు మార్లు నేరుగా ప్లేయ‌ర్లను బంతి తాకింది. దీంతో ఇప్పుడు న్యూయార్క్‌లోని ఈ పిచ్ సీనియ‌ర్ క్రికెట‌ర్ల‌కు టార్గెట్ గా మారింది. కొందరు దీనిని ప్రమాదకరమైనదిగా పేర్కొంటుండ‌గా, ఇక్క‌డ ఆడ‌టం అంత సులువు కాద‌ని మ‌రికొంద‌రు పేర్కొంటున్నారు.

Latest Videos

undefined

ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ

ఇక్క‌డి పిచ్ ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే ఆటగాళ్లు గాయపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది. ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ జాషువా లిటిల్ వేసిన బంతికి భారత కెప్టెన్ రోహిత్ శర్మ పై చేయికి గాయం కావడంతో మైదానం వీడాల్సి వచ్చింది. ఇన్నింగ్స్ 11వ ఓవర్లో జాషువా లిటిల్ వేసిన బంతికి రోహిత్ మాత్రమే కాదు, రిషబ్ పంత్ మోచేయికి గాయమైంది. అలాగే, ఐర్లాండ్ ప్లేయ‌ర్లు కూడా గాయ‌ప‌డ్డారు. దీంతో ఈ పిచ్‌పై వెటరన్ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

భారత్, ఐర్లాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలోని పిచ్ పరిస్థితిపై ఇంగ్లండ్ లెజెండ్స్ మైకేల్ వాన్, ఆండీ ఫ్లవర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆండీ ఫ్లవర్‌వాన్ ఈఎస్పీఎన్ లో మాట్లాడుతూ.. 'అంతర్జాతీయ మ్యాచ్ ఆడేందుకు ఇది మంచి గ్రౌండ్ కాదని నేను తప్పక చెప్పాలి' అని అన్నారు. అలాగే, "ఇది ప్రమాదకరంగా మారే దశలో ఉంది. బంతి రెండు వైపులా లెంగ్త్‌వైస్‌గా బౌన్స్ అవ్వడాన్ని మీరు చూసే ఉంటారు. అందుకే కొన్నిసార్లు అది క్రిందికి జారిపోతుంది, కానీ పెద్ద విషయం ఏమిటంటే అది అసాధారణంగా ఎత్తుకు ఎగిరి, ప్లేయ‌ర్ల బొటనవేళ్లు, చేతి తొడుగులు, హెల్మెట్‌లకు తగులుతున్న ఆందోళ‌న‌క‌ర ప‌రిస్థితులు క‌ల్పిస్తోంది. ఇది ఏ బ్యాట్స్‌మెన్‌కైనా ప్రాణాపాయం కలిగించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని" పేర్కొన్నాడు.

T20 World Cup 2024 : అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఒకేఒక్క‌డు.. రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు

మాజీ ఇంగ్లండ్ క్రికెటర్ మైఖేల్ వాన్ ఎక్స్‌లో చేసిన‌ పోస్ట్ లో ఇక్క‌డి పిచ్ గురించి 'షాకింగ్ సర్ఫేస్' అని పేర్కొన్నాడు. మరో పోస్ట్‌లో 'అమెరికాలో క్రికెట్ ను విస్త‌రించ‌డానికి ప్రయత్నించడం చాలా బాగుంది... నేను దీన్ని ఇష్టపడుతున్నాను, కానీ న్యూయార్క్‌లోని ఈ పేలవమైన ఉపరితలంపై ఆటగాళ్లు ఆడటం ఆమోదయోగ్యం కాదు. మీరు ప్రపంచ కప్‌లో అలాంటి స్థానాన్ని సంపాదించడానికి చాలా కష్టపడుతున్నారు, అప్పుడు మీరు దాని కోసం ఆడాలని" పేర్కొన్నాడు. ఇక ఎంతో కాలంగా క్రికెట్ ల‌వ‌ర్స్ ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ కూడా ఇదే పిచ్ పై జ‌ర‌గ‌నుంది. రెండు జట్లకు ప్రపంచ స్థాయి పేస్ బౌలర్లు ఉన్నారు. పాకిస్థాన్ జట్టులో షహీన్ షా ఆఫ్రిది, మహ్మద్ అమీర్, నసీమ్ షా వంటి బౌలర్లు ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లా పిచ్ మారితే భారత బ్యాట్స్‌మెన్ తో పాటు పాక్ ప్లేయ‌ర్ల‌కు కూడా ఇబ్బందులు తప్పవు.

IND vs IRE: అయ్యో రోహిత్ శ‌ర్మ .. మ‌ళ్లీ మ‌ర్చిపోయావా.. ! వీడియో

 

click me!