ధోని రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన రోహిత్ శ‌ర్మ

By Mahesh Rajamoni  |  First Published Jun 6, 2024, 9:40 PM IST

Rohit Sharma : అమెరికా, వెస్టిండీస్ క్రికెట్ బోర్డులు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న 9వ ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ జట్టుపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ గెలుపులో కీల‌క‌పాత్ర పోషించిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ పలు రికార్డులను బద్దలు కొట్టాడు.
 


T20 World Cup 2024 : అమెరికా, వెస్టిండీస్ వేదిక‌లుగా టీ20 ప్రపంచకప్ 2024 జ‌రుగుతోంది. దీనిలో భాగంగా భార‌త్ త‌న తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ తో త‌ల‌ప‌డింది. బ్యాటింగ్ బౌలింగ్ లో అద‌ర‌గొట్టిన టీమిండియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్ ను చిత్తుచేసింది. టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 లో ఆడిన తొలి మ్యాచ్ తో విజ‌యాన్ని అందుకుని మెగా టోర్నీలో ముందుకు సాగుతోంది. ఈ మ్యాచ్ లో విజ‌యంలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ కీల‌క పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ కెప్టెన్ ఇన్నింగ్స్ తో అద‌ర‌గొట్టాడు.

తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 16 ఓవర్లలో 96 పరుగులకు ఆలౌటైంది. హార్దిక్ పాండ్యా మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా రెండేసి వికెట్లు తీశారు. 96 పరుగుల స్వల్ప స్కోరును ఛేదించిన భారత్ 12.2 ఓవర్లలో రోహిత్ శర్మ 52 పరుగులతో లక్ష్యాన్ని సునాయాసంగా సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో రోహిత్ శ‌ర్మ గాయం కావ‌డంతో రిటైర్డ్ హార్ట్ గా పెవిలియ‌న్ కు చేరాల్సి వ‌చ్చింది. జస్ప్రీత్ బుమ్రా తన అద్భుతమైన బౌలింగ్ తో 6 పరుగులు మాత్ర‌మే ఇచ్చి రెండు వికెట్లు తీసుకుని ప్లేయ‌ర్ ఆఫ్ ది మ్యాచ్ గా ఎంపికయ్యాడు.

Latest Videos

undefined

IND vs IRE: అయ్యో రోహిత్ శ‌ర్మ .. మ‌ళ్లీ మ‌ర్చిపోయావా.. ! వీడియో

టీమిండియా ఈ గెలుపుతో కెప్టెన్ గా రోహిత్ శ‌ర్మ మ‌రో రికార్డు సాధించాడు. భార‌త మాజీ కెప్టెన్ ను మ‌హేంద్ర సింగ్ ధోని రికార్డును సైతం బ‌ద్ద‌లు కొట్టాడు. క్రికెట్ పొట్టి ఫార్మాట్‌లో అత్యంత విజయవంతమైన భారత కెప్టెన్‌గా ధోని రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శ‌ర్మ అత్యంత విజ‌య‌వంత‌మైన కెప్టెన్ గా నిలిచాడు. రోహిత్ శ‌ర్మ కెప్టెన్సీలో భార‌త్ భారత్ 55 మ్యాచ్‌ల్లో 42 గెలిచింది. ఇక కెప్టెన్సీలో 72 మ్యాచ్‌ల్లో 41 విజయాల సాధించింది. కెప్టెన్ గా ఒక జ‌ట్టుకు అత్య‌ధిక విజ‌యాలు అందించిన టాప్-5 ఆట‌గాళ్ల జాబితాలో రోహిత్ శ‌ర్మ చోటుద‌క్కించుకున్నాడు. 

ఒక కెప్టెన్ గా టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక విజయాలు సాధించిన కెప్టెన్లు 

1. బాబార్ ఆజం (పాకిస్తాన్) - 46 విజ‌యాలు
2. బ్రియాన్ మ‌సాబా (ఉగాండా) - 44 విజ‌యాలు
3. ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లాండ్) - 44 విజ‌యాలు 
4. అస్గర్ ఆఫ్ఘన్ (ఆఫ్ఘనిస్తాన్) - 42 విజ‌యాలు 
5. రోహిత్ శ‌ర్మ  (భార‌త్)  - 42 విజ‌యాలు 

T20 WORLD CUP 2024 : అంత‌ర్జాతీయ క్రికెట్ లో ఒకేఒక్క‌డు.. రోహిత్ శ‌ర్మ స‌రికొత్త రికార్డు

click me!