డేల్ స్టెయిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టిన ఆఫ్రికన్ బౌలర్ ఎవ‌రో తెలుసా?

By Mahesh RajamoniFirst Published Jun 22, 2024, 6:51 PM IST
Highlights

T20 World Cup 2024 : ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ 2024 రెండో సూపర్-8 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విక్ట‌రీ అందుకుంది. ఈ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ వికెట్ తీసిన త‌ర్వాత ఆఫ్రికన్ బౌలర్ లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు.
 

T20 World Cup 2024 : టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 రెండో సూప‌ర్-8 థ్రిల్లింగ్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 7 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయం సాధించింది. సూపర్-8లో దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా రెండో విజయం. తొలి మ్యాచ్‌లో అమెరికాను 18 పరుగుల తేడాతో ఓడించింది. ఇక రెండో మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్ లో కీల‌క స‌మ‌యంలో సూప‌ర్ ప్ర‌ద‌ర్శ‌న‌తో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా థ్రిల్లింగ్ విక్ట‌రీ అందుకుంది. ఈ మ్యాచ్ లో ఆఫ్రికన్ పేసర్ ఎన్రిక్ నోర్కియా తీసిన ఏకైక వికెట్ హ్యారీ బ్రూక్. ఒక్క వికెట్ అయినప్ప‌టికీ నోర్కియా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్టాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నార్కియా రికార్డు సృష్టించాడు.

నెంబ‌ర్ వ‌న్ ప్లేయ‌ర్ గా నార్కియా మ‌రో ఘ‌న‌త‌

Latest Videos

2024 టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో మూడో స్థానంలో ఉన్న ఎన్రిక్ నార్కియా ఇంగ్లండ్‌పై ఒక వికెట్ తీసి డేల్ స్టెయిన్‌ను అధిగమించాడు. టీ20 ప్రపంచకప్ చరిత్రలో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన నెంబ‌ర్ వ‌న్ బౌలర్‌గా నార్కియా రికార్డు సృష్టించాడు. అత‌ను ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 31 వికెట్లు తీసుకున్నాడు. డేల్ స్టెయిన్ తన టీ20 ప్రపంచ కప్ కెరీర్‌లో 30 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో మోర్నే మోర్కెల్ 24 వికెట్ల‌తో మూడో స్థానంలో ఉన్నాడు.

టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌల‌ర్లు వీరే

31 - అన్రిచ్ నార్కియా
30 - డేల్ స్టెయిన్
24 - మోర్నే మోర్కెల్
24 - కగిసో రబడ

వ‌రుస‌గా 16 ఇన్నింగ్స్ ల‌లో వికెట్లు.. 

డేల్ స్టెయిన్ రికార్డును బ‌ద్ద‌లు కొట్ట‌డ‌మే కాకుండా అన్రిచ్ నోర్కియా మ‌రో ఘ‌త‌న సాధించాడు. టీ20 ప్రపంచకప్‌లో 16 సార్లు వరుసగా ఇన్నింగ్స్‌లో కనీసం ఒక వికెట్ తీసిన బౌల‌ర్ గా ఘనత సాధించాడు. ఈ విషయంలో అతను గ్రేమ్ స్వాన్‌ను  అధిగ‌మించాడు. గ్రేమ్ స్వాన్ 2009 నుంచి 2012 వరకు వరుసగా 15 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించాడు.

16 - అన్రిచ్ నార్కియా (2021-24*)
15 - గ్రేమ్ స్వాన్ (2009-12)
15 - ఆడమ్ జంపా (2021-24*)
11 - ఇష్ సోధి (2016-21)

ఇది క‌రెక్టు కాదు.. చాలా అన్యాయం.. గౌత‌మ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

click me!