T20 World Cup 2024 Semi-Finals : గురువారం బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల విజయంతో టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8లో భారత్ గొప్ప శుభారంభం చేసింది. ఈ ప్రపంచ కప్ లో భారత జట్టు సెమీస్ చేరాలంటే బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలతో జరగబోయే మ్యాచ్ లు కీలకం.
T20 World Cup 2024 Semi-Finals : టీ20 ప్రపంచ కప్ 2024 లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా వరుస విజయాలతో ముందుకు సాగుతోంది. ఇప్పటివరకు ఓటమి ఎరుగకుండా ప్రపంచ కప్ లో ముందుకు సాగుతున్న భారత్ ముందు ఇప్పుడు సూపర్-8లో బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాలు ప్రధాన సవాళ్లుగా ఉన్నాయి. గురువారం బార్బడోస్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 47 పరుగుల విజయాన్ని అందుకోవడంతో టీ20 ప్రపంచ కప్ 2024 సూపర్-8లో భారత్ గొప్ప శుభారంభం చేసింది. రషీద్ ఖాన్ కెప్టెన్సీలో ఆఫ్ఘనిస్తాన్ పెద్ద ముప్పుగా భావించబడింది, కానీ టీమ్ ఇండియా ఈ సవాలును అద్భుతమైన రీతిలో ఎదుర్కొంది. ఈ విజయం భారత్‌ను సెమీఫైనల్‌కు చేరువ చేసింది. అయితే, ఇంకా స్పష్టత రాలేదు. జూన్ 22న బంగ్లాదేశ్‌తో, జూన్ 24న ఆస్ట్రేలియాతో మ్యాచ్ లు దీనిని ధృవీకరించనున్నాయి.
బంగ్లాదేశ్-ఆస్ట్రేలియా లతో బిగ్ ఫైట్
undefined
సెమీఫైనల్‌కు అర్హత సాధించాలంటే భారత్ రెండు మ్యాచ్‌ల్లోనూ గెలవాల్సిన అవసరం ఉందా? ఒక్క బంగ్లాదేశ్‌పై విజయం సాధిస్తే సరిపోతుందా? అనే ప్రశ్నలు గమనిస్తే.. గత రికార్డులు కూడా ప్రధాన పాత్ర పోషిస్తాయి. బంగ్లాదేశ్, ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల్లో భారత్ రికార్డు అద్భుతంగా ఉంది. బంగ్లాదేశ్‌తో భారత్ ఇప్పటి వరకు 13 టీ20 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో 12 మ్యాచ్‌లు గెలిచింది. బంగ్లాదేశ్ జట్టు ఒక్క మ్యాచ్‌లో విజయం సాధించింది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన 31 మ్యాచ్‌ల్లో టీమిండియా 19 విజయాలు సాధించింది. కంగారూ జట్టు 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం రాలేదు.
సూపర్-8 లో రెండు గ్రూపుల ఫార్మాట్?
టీ20 ప్రపంచ కప్ 2024 లో సూపర్-8 లో రెండు గ్రూపులు ఉన్నాయి, ఒక్కో గ్రూపులో నాలుగు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తన గ్రూప్‌లోని ఇతర జట్లతో ఒకసారి ఆడుతుంది. దీని తర్వాత, ప్రతి గ్రూప్ నుండి మొదటి రెండు జట్లు సెమీ-ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
సూపర్-8లో భారత్ స్థానం..?
సూపర్-8లో భారత జట్టు గ్రూప్-1లో ఉంది. ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ కూడా ఇదే గ్రూపులో ఉన్నాయి. బంగ్లాదేశ్‌ను ఓడించి ఆస్ట్రేలియా రెండు పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, అదే పాయింట్లతో భారత్ రెండో స్థానంలో ఉంది. మెరుగైన నెట్ రన్ రేట్ (NRR) కారణంగా ఆస్ట్రేలియా ముందుంది. ఆస్ట్రేలియా నెట్ రన్ రేట్ +2.471 కాగా, భారత్ నెట్ రన్ రేటు +2.350. ఆఫ్ఘనిస్థాన్, బంగ్లాదేశ్ లు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు కాబట్టి వారి ఖాతాలో ఒక్క పాయింట్ కూడా లేదు. ఆఫ్ఘన్ జట్టు -2.350 నెట్ రన్ రేట్‌తో మూడో స్థానంలో, బంగ్లాదేశ్ -2.471 నెట్ రన్ రేట్‌తో నాలుగో స్థానంలో ఉన్నాయి.
బంగ్లాదేశ్‌పై గెలిస్తే భారత్ సెమీఫైనల్‌కు చేరుకుంటుందా?
బంగ్లాదేశ్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి సెమీఫైనల్‌కు చేరుకుంటుందా అనేది ఇప్పుడు అతిపెద్ద ప్రశ్న. టీం ఇండియా తన రెండో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై గెలిస్తే.. రెండు మ్యాచ్‌ల్లో నాలుగు పాయింట్లు సాధిస్తుంది. దీంతో రోహిత్ శర్మ జట్టు సెమీఫైనల్‌కు చేరుకోవడం పక్కా. కానీ, ఇక్కడ బంగ్లాదేశ్ ను ఆస్ట్రేలియా ఓడించాలి. బంగ్లాదేశ్‌ను ఓడించిన తర్వాత, ఆస్ట్రేలియా జట్టు ఆఫ్ఘనిస్తాన్‌ను ఓడించాలని భారతదేశం కూడా కోరుకుంటుంది, దీని కారణంగా ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్‌లు తొలగించబడతాయి. రెండు జట్లూ రెండు పాయింట్లకు మించి స్కోర్ చేయలేవు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్, ఆస్ట్రేలియాలు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
ఆస్ట్రేలియా ఓడిపోతే?
ఆఫ్ఘనిస్థాన్ చేతిలో ఆస్ట్రేలియా జట్టు ఓడినా.. భారత్ ఆశలపై పెద్దగా ప్రభావం పడదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ తన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఓడించి సులభంగా అర్హత సాధిస్తుంది. అయితే, ఓడిపోయినా మూడు జట్లు కూడా 4 పాయింట్లు కష్టం. కాబట్టి ఈ సందర్భంలో నెట్ రన్ రేట్ కీలక పాత్ర పోషిస్తుంది.
రోహిత్ శర్మ కోసం మ్యాచ్ మధ్యలోనే బంగ్లాదేశ్ ప్లేయర్ తో ధోని బిగ్ ఫైట్