T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024 లో భారత్-పాకిస్థాన్ హైవోల్టేజీ మ్యాచ్ కంటే ముందే పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజం టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.
T20 World Cup 2024 : టీ20 ప్రపంచకప్ 2024లో అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్ భారత్-పాకిస్థాన్. దాయాదుల పోరులో ఇరు జట్ల ప్లేయర్ల ఆట మస్తు మజాను అందిస్తుంది. అయితే ఈ హైవోల్టేజీ మ్యాచ్ కంటే ముందే పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ప్రపంచ రికార్డు సృష్టిస్తూ భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టాడు.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా బాబర్ ఆజం నిలిచాడు. టీమిండియా దిగ్గజ ఆటగాడు విరాట్ కోహ్లీని అధిగమించారు.
కాబట్టి ఇప్పుడు భారత్ vs పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ లో మరింత ఆసక్తికరంగా మారనుంది. ఇది టీ20 ప్రపంచ కప్ 2024లో అద్భుతమైన దృశ్యం కావచ్చు.. ఎందుకంటే ఇరుజట్లలోని స్టార్ ప్లేయర్లు అయిన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బాబర్ ఆజం లు ఈ లిస్టులో నంబర్-1 కోసం పోటీ పడనున్నారు. ఇదే సమయంలో తమ జట్ల విజయం కోసం తమ సత్తాను చూపించడానికి సిద్ధంగా ఉన్నారు.
undefined
ఏందీ సామీ ఇలా ఉన్నాయి.. ప్రమాదాలను పెంచుతున్న అమెరికా 'డ్రాప్-ఇన్' పిచ్‌లు
అమెరికాతో జరిగిన మ్యాచ్ లో బాబర్ ఆజం హాఫ్ సెంచరీకి 6 పరుగుల దూరంలో ఔట్ అయ్యాడు. 44 పరుగుల ఈ ఇన్నింగ్స్ తో టీ20 ఇంటర్నేషనల్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా నిలిచాడు. బాబార్ ఆజం టీ20 క్రికెట్ లో 121 మ్యాచ్‌ల్లో 4067 పరుగులు చేశాడు. టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ 118 మ్యాచ్‌ల్లో 4038 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ 152 మ్యాచ్‌లు ఆడి 4026 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. వీరి ముగ్గురి మధ్య పరుగుల వ్యత్యాసం పెద్దగా లేకపోవడంతో రాబోయే భారత్-పాక్ మ్యాచ్ మరింత ఆసక్తిని పెంచుతోంది.
జూన్ 9న న్యూయార్క్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్ల మధ్య నంబర్-1 పోరులో భిన్నమైన ఉత్కంఠ నెలకొంది. బాబర్ ఫ్లాప్ అయితే, కోహ్లీ భారీ స్కోరు చేస్తే నంబర్-1కి వస్తాడు. విరాట్ కోహ్లీ, బాబార్ ఆజం ఇద్దరూ ఫ్లాప్ అయి, రోహిత్ శర్మ వరుసగా రెండో మ్యాచ్‌లో భారీ ఇన్నింగ్స్ ఆడితే, హిట్‌మ్యాన్ నంబర్-1 స్థానంలోకి చేరుతాడు. ఈ ప్రపంచ కప్ లో భారత్ తొలి మ్యాచ్ లో ఐర్లాండ్ ను ఓడించింది. ఇందులో రోహిత్ అద్భుత హాఫ్ సెంచరీ సాధించాడు.
ధోని రికార్డును బద్దలు కొట్టిన రోహిత్ శర్మ