టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి జింబాబ్వే, నెదర్లాండ్స్... శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్‌తో కలిసి..

Published : Jul 16, 2022, 01:41 PM IST
టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి  జింబాబ్వే, నెదర్లాండ్స్...  శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్‌తో కలిసి..

సారాంశం

యునైటెడ్ స్టేట్స్‌ని ఓడించిన నెదర్లాండ్స్... పపువా న్యూ గినీపై ఘన విజయం అందుకున్న జింబాబ్వే... 2016 తర్వాత టీ20 వరల్డ్ కప్‌కి అర్హత సాధించిన జింబాబ్వే..

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ క్వాలిఫైయర్ మ్యాచులు ముగిశాయి. పపువా న్యూ గినీని ఓడించిన జింబాబ్వే, యునైటెడ్ స్టేట్స్‌ని చిత్తు చేసిన నెదర్లాండ్స్... ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి అర్హత సాధించాయి...

పపువా న్యూ గినీతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 199 పరుగుల భారీ స్కోరు చేసింది. వీస్లే మాదేవేర్ 29 బంతుల్లో 42, క్రెగ్ ఎర్వీన్ 38, రోగిస్ చక్బవ 30, మిల్టన్ సుంబ 29 పరుగులు చేసి భారీ స్కోరు చేయడంలో తమ వంతు పాత్ర పోషించారు...

200 పరుగుల లక్ష్యఛేదనలో బరిలో దిగిన పవువా న్యూ గినీ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 172 పరుగులకు పరిమితమైంది. టోనీ వురా 35 బంతుల్లో 66 పరుగులు చేసి ఒంటరి పోరాటం చేశాడు. జింబాబ్వే బౌలర్ బ్లెస్సింగ్ ముజరబానీ 24 పరుగులకు 2 వికెట్లు తీశాడు...

మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్‌ని 19.4 ఓవర్లలో 138 పరుగులకి ఆలౌట్ అయ్యింది. నెదర్లాండ్ బ్యాటర్ 67 బంతుల్లో 91 పరుగులు చేయడంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించిన నెదర్లాండ్స్... టీ20 వరల్డ్ కప్ బెర్త్ కన్ఫార్మ్ చేసుకుంది...

ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్కప్ 2022 టోర్నీ తొలి రౌండ్‌లో వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్, నమీబియా, యూఏఈలతో కలిసి తలబడబోతున్నాయి జింబాబ్వే, నెదర్లాండ్స్... గత ఏడాది కరోనా కారణంగా యూఏఈ వేదికగా జరిగిన టీ20 వరల్డ్ కప్‌ 2021 టోర్నీలో స్కాట్లాండ్, నమీబియా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధించాయి...

రెండు గ్రూప్‌లుగా విడిపోయి జరిగే గ్రూప్స్‌లో టేబుల్ టాపర్‌గా నిలిచిన రెండేసి జట్లు, సూపర్ 12 రౌండ్‌కి అర్హత సాధిస్తాయి. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకూ ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్నీ, బ్రిస్బేన్, ఆడిలైడ్, గీలాంగ్, హోబర్ట్, పెర్త్ వేదికల్లో టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీ జరగనుంది. 

2021 టీ20 వరల్డ్ కప్‌ సమయంలో సస్పెన్షన్‌కి గురైన జింబాబ్వే, 2009లో అనివార్య కారణాలతో టీ20 వరల్డ్ కప్ నుంచి నిష్కమించింది. 2007, 2010, 2012, 2014, 2016 టీ20 వరల్డ్ కప్ టోర్నీల్లో పాల్గొన్న జింబాబ్వే... గ్రూప్ స్టేజీకి పరిమితమైంది... 1999, 2003 వన్డే వరల్డ్ కప్‌లో సూపర్ సిక్స్ రౌండ్‌కి అర్హత సాధించి సంచలనం క్రియేట్ చేసిన జింబాబ్వే, ఈసారి కూడా అలాంటి ఆటతీరు కనబర్చాలని భావిస్తోంది.

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీకి ముందు భారత జట్టుతో కలిసి రెండు వన్డే మ్యాచులు ఆడనుంది జింబాబ్వే. 

PREV
click me!

Recommended Stories

IND vs SA: లక్నోలో పొగమంచు దెబ్బ.. నాలుగో టీ20 రద్దు
ICC Rankings : వరుణ్ చక్రవర్తి దెబ్బ.. బుమ్రా ఆల్ టైమ్ రికార్డు బద్దలు