
పసికూన ఐర్లాండ్ జట్టు, టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో దూసుకుపోతోంది. భారత్‌తో జరిగిన రెండో టీ20లో 225 పరుగుల లక్ష్యఛేదనలో 221 పరుగులు చేసి భారత బౌలర్లకు చుక్కలు చూపించిన ఐర్లాండ్ టీమ్, ఈసారి న్యూజిలాండ్‌కి గుండెపోటు తెప్పించింది...
ఐర్లాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో ఒక్క వికెట్ తేడాతో ఆఖరి ఓవర్ ఆఖరి బంతి మిగిలి ఉండగా విజయం సాధించిన న్యూజిలాండ్ టీమ్, మూడో వన్డేలో బాల్ సెంటర్‌లో తగిలి అవుటయ్యే ప్రమాదం తప్పించుకున్నట్టుగా 1 పరుగు తేడాతో గెలిచి, ఊపిరి పీల్చుకుంది...
మూడో వన్డేలో తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 360 పరుగులు చేసింది. ఓపెనర్ మార్టిన్ గుప్టిల్ 126 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 115 పరుగులు చేసి అదరగొట్టాడు. ఫిన్ ఆలెన్ 28 బంతుల్లో 7 ఫోర్లతో 33 పరుగులు చేయగా కెప్టెన్ టామ్ లాథమ్ 26 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 30 పరుగులు చేశాడు...
హెన్రీ నికోలస్ 54 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 79 పరుగులు చేయగా గ్లెన్ ఫిలిప్స్ 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేశాడు. బ్రాస్‌వెల్ 21, మిచెల్ సాంట్నర్ 14 పరుగులు చేయగా విల్ యంగ్ 12 బంతుల్లో 3 పరుగులు చేసి నిరాశపరిచాడు...
361 పరుగుల భారీ లక్ష్యఛేదనలో కెప్టెన్ ఆండ్రూ బాల్‌బిర్నీ డకౌట్ కావడంతో 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఐర్లాండ్. ఆండీ మెక్‌బ్రిన్ 26 పరుగులు చేసి పెవిలియన్ చేరడంతో 62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. అయితే ఈ దశలో పౌల్ స్టిర్లింగ్, హెన్రీ టెక్టర్ కలిసి మూడో వికెట్‌కి 179 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు...
పౌల్ స్టిర్లింగ్ 103 బంతుల్లో 14 ఫోర్లు, 5 సిక్సర్లతో 120 పరుగులు చేయగా హెన్రీ టెక్టర్ 106 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 108 పరుగులు చేశాడు. అయితే ఈ ఇద్దరూ అవుటైన తర్వాత గెరత్ డెలనీ 22, కుర్టీస్ కాంపర్ 5, లోర్కన్ టక్టర్ 14, జార్జ్ డక్రెల్ 22 చేసి అవుట్ కావడంతో వరుస వికెట్లు కోల్పోయింది ఐర్లాండ్..
ఆఖరి ఓవర్‌లో ఐర్లాండ్ విజయానికి 10 పరుగులు మాత్రమే కావాల్సి రావడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. మొదటి రెండు బంతుల్లో సింగిల్ మాత్రమే రాగా మూడో బంతికి ఫోర్ బాదిన క్రెగ్ యంగ్, లక్ష్యాన్ని మూడు బంతుల్లో 5 పరుగులుగా మార్చేశాడు.
అయితే ఆ తర్వాతి బంతికి రెండో పరుగుకి ప్రయత్నించి క్రెగ్ యంగ్ రనౌట్ అయ్యాడు. దీంతో ఆఖరి 2 బంతుల్లో 4 పరుగులు కావాల్సి వచ్చాయి. ఐదో బంతికి సింగిల్ రాగా, ఆఖరి ఓవర్‌లో 3 పరుగులు కావాల్సిన స్థితిలో ఒక్క పరుగు మాత్రమే ఇచ్చిన కివీస్ బౌలర్ బ్లేయిర్ టిక్నర్... కివీస్‌కి 1 పరుగు తేడాతో తేడాతో ఉత్కంఠ విజయం అందించాడు...
వరుసగా మూడు మ్యాచుల్లో గెలిచిన న్యూజిలాండ్ 3-0 తేడాతో సిరీస్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే మూడు వన్డేల్లోనూ విజయానికి దగ్గరగా వచ్చిన ఐర్లాండ్, టాప్ క్లాస్ పర్ఫామెన్స్‌తో న్యూజిలాండ్‌కి చుక్కలు చూపించింది...