T20 Worldcup: సెమీ ఫైనల్స్ కి ముందు పాకిస్తాన్ జట్టుకి ఊహించని షాక్..!

Published : Nov 11, 2021, 11:18 AM IST
T20 Worldcup:  సెమీ ఫైనల్స్  కి ముందు పాకిస్తాన్ జట్టుకి ఊహించని షాక్..!

సారాంశం

ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌, షోయబ్‌ మాలిక్‌ అందుబాటులో ఉంటారో లేరోనన్న అంశంపై అనుమానాలు నెలకొన్నాయి.

T20 Worldcup లో పాకిస్తాన్ జట్టు వరస విజయాలతో దూసుకుపోతోంది. త్వరలోనే సెమీ ఫైనల్స్ లో ఆస్ట్రేలియా జట్టుతో తలపడనుంది.  కాగా. ఈ సెమీ ఫైనల్స్ కి ముందు పాకిస్తాన్  జట్టుకి ఊహించని షాక్ తగిలింది.

 ఆ జట్టు స్టార్‌ బ్యాటర్‌లు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్  ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఇద్దరు గత రెండు రోజులు నుంచి ఫ్లూ జ్వరంతో బాధపడతున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ వీరిద్దరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కాగా ఈ ఇద్దరు ఆటగాళ్లు బుధవారం ప్రాక్టీస్ సెషన్‌కు దూరమయ్యారు. దీంతో ఈ మ్యాచ్‌లో రిజ్వాన్‌, షోయబ్‌ మాలిక్‌ అందుబాటులో ఉంటారో లేరోనన్న అంశంపై అనుమానాలు నెలకొన్నాయి.

Also Read: T20 World cup: గాల్లోకి ఎగిరి క్యాచ్ పట్టాడు.. కానీ..!

ఒకవేళ ఈ మ్యాచ్‌కు మహ్మద్ రిజ్వాన్, షోయబ్ మాలిక్ అందుబాటులో లేకపోతే వారి స్ధానంలో సర్ఫరాజ్ అహ్మద్, హైదర్ అలీకు తుది జట్టులో చోటు దక్కనున్నట్లు సమాచారం. వీరిద్దరిని మ్యాచ్‌కు సిద్ధంగా ఉండమని పీసీబీ ఆదేశించినట్లు తెలుస్తోంది. 

Also Read: T20 Worldcup 2021: ఫైనల్ చేరిన న్యూజిలాండ్... ఎట్టకేలకు ఇంగ్లాండ్‌పై ప్రతీకారం తీర్చుకున్న కివీస్...

కాగా ఈ టోర్నమెంట్‌లో పాకిస్తాన్‌ విజయంలో రిజ్వాన్, మాలిక్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన మూడో ఆటగాడిగా  మహ్మద్ రిజ్వాన్ ఉన్నాడు. నవంబర్ 11న (గురువారం) పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌ వేదికగా జరగనుంది. ఇక ఇప్పటికే ఇంగ్లండ్‌పై విజయంతో న్యూజిలాండ్‌ ఫైనల్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

IND vs SA: ధర్మశాలలో అదరగొట్టిన భారత బౌలర్లు.. అభిషేక్ శర్మ ఊచకోత
టీమిండియాలో నయా సంజూ శాంసన్.. పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న ఆరోన్ జార్జ్ ఎవరు?