India vs Pakistan: భారత్ తో మ్యాచ్ లో పాక్ ఓడిపోతే బ్యాగ్ సర్దుకోవాల్సిందే.. ఆసీస్ మాజీ స్పిన్నర్ వ్యాఖ్యలు

By team teluguFirst Published Oct 22, 2021, 3:05 PM IST
Highlights

T20 World Cup 2021: ప్రపంచ క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్ పై ఇరుదేశాలకు చెందిన మాజీ లతో పాటు ఇతర దేశాల  సీనియర్ క్రికెటర్లు కూడా కామెంట్లు చేస్తున్నారు.

ఐసీసీ టీ20 ప్రపంచకప్ (ICC T20 worldcup) లో భాగంగా రేపటి నుంచి సూపర్-12 దశ మొదలుకానున్నది. తొలి మ్యాచ్ లో  డిఫెండింగ్ చాంఫియన్స్  వెస్టిండీస్ (West Indies).. ఇంగ్లండ్ (England)ను ఢీకొనబోతుంది. ఇక భారత  జట్టు (Team India) ఈనెల 24న దాయాది దేశం పాకిస్థాన్ (pakistan)తో తలపడబోతున్నది. ఈ  మ్యాచ్ పై ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచ క్రికెట్ ప్రేమికులు కూడా ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఈ నేపథ్యంలో పలువురు మాజీ క్రికెటర్లు  ఈ మ్యాచ్ ఫలితంపై  వారి అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. 

ఇప్పటికే పాక్ కు చెందిన అబ్దుల్ రజాక్, ఇంజమామ్ ఉల్ హక్ వంటి మాజీలు భారత్-పాక్ మ్యాచ్ పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా ఆసీస్ (Australia) మాజీ స్పిన్నర్ బ్రాడ్ హాగ్ (Brad Hogg) కూడా స్పందించాడు. ఈ టోర్నీలో భారత్ తో మ్యాచ్ గనుక పాక్ ఓడిపోతే ఆ జట్టు బ్యాగ్ సర్దుకోవాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. 

యూట్యూబ్ వేదికగా భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా అడిగిన ఓ ప్రశ్నకు హాగ్ సమాధానమిచ్చాడు. రెండు గ్రూప్ ల నుంచి సెమీస్ కు వెళ్లే జట్టు ఏదో వివరించాడు. అయితే అతడు ఎంపిక చేసిన జాబితాలో ఆస్ట్రేలియా లేకపోవడం గమనార్హం. 

ఇవీ చదవండి: T20 World Cup: ‘మారో.. ముజే మారో’మళ్లీ వచ్చాడు.. ఈసారి మరింత ఫన్ తో.. భారత్-పాక్ మ్యాచ్ పై మీమర్స్ కు పండగే..

IPL New Teams: ఐపీఎల్ కొత్త ఫ్రాంచెైజీ కోసం ఆసక్తి చూపుతున్న బాలీవుడ్ హాట్ కపుల్..? ఓ భారీ వ్యాపారవేత్త అండ?

IPL New Teams: ఐపీఎల్ లో కొత్త జట్లు అవేనా..? ఒక ఫ్రాంచైజీని దక్కించుకోనున్న మోదీ ఆప్త మిత్రుడు!

హాగ్ స్పందిస్తూ.. ‘గ్రూప్ 1 నుంచి ఇంగ్లండ్, వెస్టిండీస్ లు సెమీస్ కు వెళ్తాయి. గ్రూప్-2 నుంచి భారత్, పాకిస్థాన్  లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయి. కానీ,  భారత్ తో జరిగే తొలి మ్యాచ్ లో గనక పాక్ ఓడిపోతే అది దాని సెమీస్ అవకాశాలను దెబ్బతీస్తుంది. తర్వాత మ్యాచ్ లో వాళ్లు న్యూజిలాండ్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది పాక్ కు నష్టమే. కానీ భారత్ మాత్రం తప్పకుండా సెమీస్ చేరుతుంది’ అని అన్నాడు. 

ఇదిలాఉండగా కీలక పోరు కోసం భారత్ సిద్ధమవుతున్నది.  ఇప్పటికే జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ లలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియాను ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పటిష్టంగా కనిపిస్తున్న ఇండియాను ఢీకొట్టడం పాక్ కు కష్టమే అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. 

click me!