swimming cricket: క్రికెట్ అంటే పిచ్చి అభిమానంతో ఊగిపోవడం ఇతర దేశాలతో పోలిస్తే భారత్ లో చాలా ఎక్కువనే చెప్పాలి. ఇప్పటికే చిత్రవిచిత్రాలు కనిపిస్తూ మనల్ని ఆశ్చర్యానికి గురిచేసిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇదే క్రమంలో పరుగులు రావాలంటే బౌండరీలు కొట్టాలి లేదా పరుగెత్తాలి. కానీ ఇక్కడ మీరు చూడబోయే క్రికెట్ లో పరుగులు రావాలంటే ఈత కొట్టాల్సిందే.. !
swim cricket: క్రికెట్ లో పరుగులు ఎలా వస్తాయని క్రికెట్ ప్రియులను ఎవరినైనా అడిగితే క్షణం కూడా ఆలోచన చేయకుండా టక్కున బౌండరీలు కొడితే, లేదా వికెట్ల మధ్య పరుగెడితే అని చెప్పేస్తారు. కానీ, ఇక్కడ జరుగుతున్న క్రికెట్ లో ఈత కొడితేనే పరులుగు వస్తాయి ! నిజంగా మీకు నమ్మశక్యంగా లేదు కదా.. ! అదే మరి ఈ క్రికెట్ లో ఉన్న సరికొత్తదనం. అదే స్విమ్ క్రికెట్.. ఈ క్రికెట్ లో పరుగులు చేయాలంటే ప్లేయర్లు ఈత కొట్టాల్సిందే. ఇక్కడ క్రికెట్ గ్రౌండ్ లో కాకుండా నీటిలో అడుతారు.. ! నీటిలో క్రికెట్.. పరుగుల కోసం ఈత కొట్టడం.. ఇది సూపర్ క్రేజీ అనిపిస్తుంది కదా.. ! అలాంటి నీటిలో ఆడే స్విమ్ క్రికెట్ కు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. !
ఆ వీడియో దృశ్యాలలో యువ ఆటగాళ్లు నీటిలో క్రికెట్ ఆడుతున్నారు. ఒక బాల్ కు రెండు పరుగులు చేయాల్సి ఉందనీ, అయితే, బాల్ ను షాట్ కొట్టిన తర్వాత ప్లేయర్లు నీటిలో పరుగులు కోసం ఈత కొట్టడం.. రెండో పరుగు తీసే సమయంలో రనౌట్.. అది థర్డ్ ఎంపైర్ రివ్వూకు వెళ్లడం.. తర్వాత ఔట్ ప్రకటించడం.. బౌలింగ్ చేస్తున్న టీమ్ గెలవడం క్రేజీగా అనిపిస్తోంది. నెట్టింట ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ వీడియోను మీరు చూసేయండి మరి.. మీకు ఎలా అనిపిస్తోందో కామెంట్స్ కూడా చేయండి.. !
ఇది మాములు క్రికెట్ కాదు వీర లెవల్.. 😍😂 pic.twitter.com/QoaQtSVT6U
— mahe (@mahe950)జింబాబ్వే పర్యటనకు భారత్.. 5 టీ20ల సిరీస్ షెడ్యూల్ ఇదిగో..