రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దుబే, దీపక్ హూడా వికెట్లు తీశాడు విఘ్నేష్.
చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ - ముంబై ఇండియన్స్ మ్యాచ్ తర్వాత విఘ్నేష్ పుత్తూరు సోషల్ మీడియాలో స్టార్ అయ్యాడు. ముంబై ప్లేయర్ అయిన విఘ్నేష్ నాలుగు ఓవర్లలో 32 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీశాడు. రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దుబే, దీపక్ హూడా వికెట్లు విఘ్నేష్ ఖాతాలో వేసుకున్నాడు.
రోహిత్ శర్మకు బదులుగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా విఘ్నేష్ టీమ్‌లోకి వచ్చాడు. విఘ్నేష్ పుత్తూరు మలప్పురం, పెరింతల్‌మన్న పీటీఎం కాలేజీలో ఎంఏ చదువుతున్నాడు. ముంబై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విఘ్నేష్ గురించి మాట్లాడాడు.
సూర్య మాటల్లో.. ''మాకు 15-20 రన్స్ తక్కువయ్యాయి. కానీ మా ప్లేయర్లు పోరాడిన తీరు అద్భుతం. ముంబై ఎప్పుడూ యంగ్ టాలెంట్‌కు అవకాశాలిస్తుంది. గత 10 నెలలుగా స్కౌట్స్ ద్వారా ప్లేయర్లను వెతుకుతున్నాం. దాని ఫలితమే విఘ్నేష్. 18వ ఓవర్ అతనికి ఇవ్వడానికి నాకు ఎలాంటి డౌట్ లేదు. ఆట ముందుకు సాగితే అతనితో చేయించాలని అనుకున్నా. రెండో ఇన్నింగ్స్‌లో రుతురాజ్ ఆడిన విధానం మ్యాచ్‌ను మా నుంచి దూరం చేసింది'' అని సూర్య చెప్పాడు.
మ్యాచ్ తర్వాత లెజెండరీ వికెట్ కీపర్ ఎంఎస్ ధోనీ విఘ్నేష్‌ను అభినందించాడు. పెరింతల్‌మన్నలోని ఆటో డ్రైవర్ సునీల్ కుమార్, బిందుల కొడుకు విఘ్నేష్ కేరళ జూనియర్ టీమ్‌లకు ఆడాడు. కేరళ క్రికెట్ లీగ్‌లో బాగా ఆడటంతో ముంబై ఇండియన్స్ సెలక్షన్ ట్రయల్స్‌కు అవకాశం వచ్చింది. ప్రాక్టీస్ క్యాంప్‌లో, నెట్స్‌లో హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ లాంటి బ్యాటర్లకు కచ్చితంగా బంతులేయడంతో 23 ఏళ్ల కుర్రాడికి మొదటి మ్యాచ్‌లోనే ఛాన్స్ వచ్చింది. రోహిత్ శర్మకు బదులుగా ఇంపాక్ట్ ప్లేయర్‌గా విఘ్నేష్ టీమ్‌లోకి వచ్చాడు.