Ind Vs Aus T20I: సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా భారత జట్టు ప్రకటన

By narsimha lode  |  First Published Nov 20, 2023, 10:52 PM IST

 అస్ట్రేలియాతో టీ 20 సిరీస్ కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ.  అస్ట్రేలియాతో ఐదు  టీ 20  మ్యాచ్ లు ఆడనుంది ఇండియా.


న్యూఢిల్లీ: అస్ట్రేలియా జట్టుతో జరిగే టీ 20 సీరీస్ కు  భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది.ఈ టీ  20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్  కెప్టెన్ గా  వ్యవహరించనున్నారు. హర్ధిక్ పాండ్యా  గాయం కారణంగా  జట్టుకు దూరంగా ఉండడంతో  సూర్యకుమార్ యాదవ్ కు కెప్టెన్సీ బాధ్యతలను బీసీసీఐ అప్పగించింది.  

ఈ నెల  23న విశాఖపట్టణంలో  అస్ట్రేలియాతో ఐదు మ్యాచ్ ల టీ 20 సిరీస్ ప్రారంభం కానుంది.  ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్  వైస్ కెప్టెన్ గా కొనసాగుతారు. శ్రేయాస్ అయ్యర్ మాత్రం  బెంగుళూరు, రాయ్ పూర్ లలో జరిగే చివరి రెండు టీ 20 మ్యాచ్ ల్లో మాత్రమే ఆడుతాడు. అంతేకాదు గైక్వాడ్ నుండి వైస్ కెప్టెన్ బాధ్యతలను శ్రేయాస్ స్వీకరించనున్నారు.

Latest Videos

తిరువనంతపురంలో రెండో టీ20 మ్యాచ్ ఈ నెల 26న జరగనుంది. ఈ నెల  28న గౌహతిలో మూడో  టీ20 మ్యాచ్, డిసెంబర్ 1న జైపూర్ లో నాలుగో టీ20 మ్యాచ్, డిసెంబర్ 3న బెంగుళూరులో  ఐదో మ్యాచ్ నిర్వహించనున్నారు.

also read:mohammed shami... భారత ఆటగాళ్లకు మోడీ ఓదార్పు: సోషల్ మీడియాలో పంచుకున్న మహమ్మద్ షమీ

ప్రపంచకప్ పోటీల్లో బంగ్లాదేశ్ తో జరిగిన  మ్యాచ్ లో  హర్ధిక్ పాండ్యా కు గాయమైంది. దీంతో ఆయన  టీ 20 సిరీస్ కు దూరంగా ఉండాల్సి వచ్చింది. టీ20 సిరీస్ కు  హార్ధిక్ పాండ్యానే  నాయకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే సంజూ శాంసన్ కు జట్టులో చోటు దక్కలేదు.

 భారత జట్టు సభ్యులు వీరే

సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్)
రుతురాజ్ గైక్వాడ్(వైస్ కెప్టెన్)
ఇషాన్ కిషన్,
యశస్వి జైస్వాల్
తిలక్ వర్మ, 
రింకూ సింగ్, 
ఆవేశ్ ఖాన్, 
రవి బిష్ణోయ్
ముకేష్ కుమార్
అర్ష్‌దీప్ సింగ్
ప్రసిద్ద్ కృష్ణ
అక్షర్ పటేల్
వాషింగ్టన్ సుందర్
జితేశ్ శర్మ,
శివమ్ దూబే

బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్, అవేష్ ఖాన్, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్ ఉన్నారు. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్,శివమ్ దూబే వంటి ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు. 

click me!