నవంబర్ 23 నుంచి ఇండియా - ఆస్ట్రేలియా టీ20 సిరీస్... కెప్టెన్‌గా రుతురాజ్ గైక్వాడ్?

By Chinthakindhi Ramu  |  First Published Nov 20, 2023, 4:26 PM IST

నవంబర్ 23న వైజాగ్‌లో  ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ20 మ్యాచ్... ఇంకా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. 


ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ముగిసింది. ఈ టోర్నీకి ముందు ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ ఆడిన భారత జట్టు, వరల్డ్ కప్ ముగిసిన తర్వాత అదే జట్టుతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడుతోంది. వచ్చే ఏడాది జూన్‌లో యూఎస్‌ఏ, వెస్టిండీస్ వేదికలుగా టీ20 వరల్డ్ కప్ 2024 టోర్నీ జరగనుంది. దానికి ప్రాక్టీస్‌గా ఈ టీ20 సిరీస్‌ని చూస్తున్నాయి ఇరుజట్లు..

నవంబర్ 23న వైజాగ్‌లో డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి క్రికెట్ స్టేడియంలో ఇండియా- ఆస్ట్రేలియా మధ్య మొదటి టీ20 మ్యాచ్ జరగనుంది. అయితే ఇప్పటిదాకా ఈ సిరీస్‌కి జట్లను ప్రకటించలేదు ఇండియా - ఆస్ట్రేలియా..

Latest Videos

ఇరు జట్లు వరల్డ్ కప్ ఫైనల్‌ చేరడంతో ఈ టీ20 సిరీస్‌కి కీ ప్లేయర్లు అందరూ దూరంగా ఉండే అవకాశం ఉంది. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత టీ20 ఫార్మాట్‌కి హార్ధిక్ పాండ్యా కెప్టెన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నాడు. అయితే వన్డే వరల్డ్ కప్‌లో గాయపడిన హార్ధిక్ పాండ్యా, ఇంకా కోలుకోలేదు. దీంతో ఈ సిరీస్‌కి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నట్టు సమాచారం..

ఏషియన్ గేమ్స్ 2022 పోటీల్లో భారత పురుషుల క్రికెట్ టీమ్‌కి కెప్టెన్‌గా వ్యవహరించాడు రుతురాజ్ గైక్వాడ్. ఫైనల్ చేరిన భారత జట్టు, వర్షం కారణంగా మ్యాచ్ సాగకపోవడంతో స్వర్ణం గెలిచింది. అయితే టీ20 సిరీస్‌కి 3 రోజుల సమయం మాత్రమే ఉన్నా బీసీసీఐ ఇంకా జట్టును ప్రకటించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

టీమ్ అనౌన్స్‌మెంట్ వచ్చాక ప్లేయర్లు అందరూ ఎన్‌సీఏకి చేరుకుని, ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంటుంది. దీనికైనా కనీసం రెండు మూడు రోజుల సమయం కావాలి. చూస్తుంటే విజయ్ హాజారే సిరీస్ కోసం సిద్ధమవుతున్న యంగ్ ప్లేయర్లనే ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ఆడించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు తెలుస్తోంది..  

click me!