బంతి నేలను తాకినా అవుట్‌గా నిర్ణయం... థర్డ్ అంపైర్‌కి కంటి ఆపరేషన్ అవసరమా...

By team teluguFirst Published Mar 18, 2021, 8:30 PM IST
Highlights

బంతి నేలను తాకుతున్నట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించినా అవుట్‌గా ప్రకటించిన థర్డ్ అంపైర్...

తొలి ఇన్నింగ్స్‌లో అద్భుత హాఫ్ సెంచరీ చేసి అవుటైన సూర్యకుమార్ యాదవ్...

ఇండియా, ఇంగ్లాండ్ సిరీస్‌లో మరోసారి థర్డ్ అంపైర్ నిర్ణయం వివాదాస్పదమైంది. 31 బంతుల్లో ఆరు ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో డేవిడ్ మలాన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే మలాన్ పట్టిన క్యాచ్‌, బంతి నేలను తాకినట్టు టీవీ రిప్లైలో స్పష్టంగా కనిపించింది.

అయితే థర్డ్ అంపైర్ మాత్రం నిర్ణయం ప్రకటించడానికి చాలా సమయం తీసుకుని అవుట్‌గా ప్రకటించాడు. దీంతో వివాదాస్పద నిర్ణయం ప్రకటించిన థర్డ్ అంపైర్‌పై సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ వస్తోంది.

బంతి నేలను తాకుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నా అవుట్‌గా ప్రకటించాడంటే, థర్డ్ అంపైర్ కళ్లకి ఆపరేషన్ చేయించాలి.... అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు. మనదేశంలో కాబట్టి అవుట్ ప్రకటించారు కానీ వేరే దేశంలో అంపైర్ అయినా ఇలా నేలపై తాకి వచ్చిన క్యాచ్‌గా అవుట్‌గా ప్రకటించేవారా? అంటూ ప్రశ్నిస్తున్నారు. 

click me!