
ఐపీఎల్ 2021 వేలంపాటలో కడప కుర్రాడు మారంరెడ్డి హరిశంకర్ రెడ్డిని, చెన్నై సూపర్ కింగ్స్‌కి బేస్ ప్రూజ్ రూ.20 లక్షలకు కొనుగోలు చేసింది. ధోనీ కెప్టెన్సీలోని చెన్నై సూపర్ కింగ్స్‌లో కుర్రాళ్లకు అవకాశం రావడం తక్కువే అయినా ప్రాక్టీస్ మ్యాచ్‌లో హరిశంకర్ రెడ్డి, అద్భుతమై చేశాడు.
సీఎస్‌కే క్యాంప్ నిర్వహించిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనీతో పాటు అంబటి రాయుడు, రుతురాజ్ గైక్వాడ్, జగదీశన్, హరి నిశాంత్, హరిశంకర్ రెడ్డి ప్లేయర్లు పాల్గొన్నారు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ధోనీకి బౌలింగ్ చేసిన హరిశంకర్ రెడ్డి, అతన్ని క్లీన్‌బౌల్డ్ చేశాడు.
హరిశంకర్ రెడ్డి విసిరిన ఇన్‌స్వింగర్ బాల్‌కి మాహీ దగ్గర సమాధానం లేకపోవడంతో లెగ్ స్టంప్ గాల్లోకి ఎగిరింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హరిశంకర్ రెడ్డి తండ్రి రామచంద్రా రెడ్డి కడప జిల్లాలో ఓ సాధారణ రైతు.