INDvsENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్..

Published : Mar 18, 2021, 06:36 PM IST
INDvsENG: టాస్ గెలిచిన ఇంగ్లాండ్... ఇషాన్ కిషన్ స్థానంలో సూర్యకుమార్ యాదవ్..

సారాంశం

వరుసగా రెండో మ్యాచ్‌లోనూ టాస్ ఓడిన విరాట్ కోహ్లీ... మొదట బ్యాటింగ్ చేయనున్న టీమిండియా...  

ఇండియా, ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. టీమిండియా మొదట బ్యాటింగ్ చేయనుంది. గత మూడు మ్యాచుల్లో టాస్ గెలిచి, బౌలింగ్ ఎంచుకున్న జట్లకే విజయం దక్కిన విషయం తెలిసిందే.

ఇప్పటికే రెండు మ్యాచుల్లో ఓడిన టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌లో వెనకబడింది. నేటి మ్యాచ్‌లో టీమిండియా ఓడితే టీ20 సిరీస్ ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది. కాబట్టి భారత జట్టుకి నేటి మ్యాచ్‌లో గెలవడం చాలా కీలకం..

ఇషాన్ కిషన్ గాయంతో బాధపడుతుండడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ జట్టులోకి వచ్చాడు. చాహాల్ స్థానంలో రాహుల్ చాహార్ ఆడబోతున్నాడు. 

ఇంగ్లాండ్ జట్టు:
ఇయాన్ మోర్గాన్, బట్లర్, జాసన్ రాయ్, డేవిడ్ మలాన్, బెయిర్ స్టో, బెన్ స్టోక్స్, సామ్ కుర్రాన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, అదిల్ రషీద్, మార్క్ వుడ్ 

భారత జట్టు:

రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ చాహార్, శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా

PREV
click me!

Recommended Stories

IND vs ENG: కింగ్ కోహ్లీ విధ్వంసం.. ఇంగ్లాండ్ వన్డే సిరీస్‌లో బద్దలవ్వబోయే 9 వరల్డ్ రికార్డులు ఇవే !
Vaibhav Suryavanshi: ఇంగ్లండ్‌ టూర్‌లో వైభవ్ సూర్యవంశీ ఎందుకు ఫ్లాప్ అయ్యాడు? ఆ 67 సెంచరీల లెజెండ్ ఏమన్నారంటే?