సూప‌ర్ ఫీల్డింగ్.. క‌ళ్లుచెదిరే క్యాచ్ ప‌ట్టిన కేఎల్ రాహుల్.. సంజీవ్ గోయెంకా ప్రశంసలు

By Mahesh Rajamoni  |  First Published May 14, 2024, 10:25 PM IST

DC vs LSG: ఐపీఎల్ 2024 ప్లేఆఫ్స్ కోసం లక్నో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ అద్భుత‌మైన ఫీల్డింగ్ తో డైవ్ చేసి క‌ళ్లుచెదిరే క్యాచ్ ప‌ట్టాడు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది. 
 


KL Rahul Super Catch : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) లో ప్లేఆఫ్స్ రేసు ర‌స‌వ‌త్త‌రంగా మారుతోంది. ఈ క్ర‌మంలోనే ప్లేఆఫ్ రేసులో నిల‌వడం కోసం లక్నో జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో డూ ఆర్ డై మ్యాచ్ ఆడుతోంది. గత మ్యాచ్‌లో హైదరాబాద్‌తో చేతితో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వచ్చింది. దీంతో ల‌క్నో య‌జ‌మాని సంజీవ్ గోయెంకా కెప్టెన్ కేఎల్ రాహుల్ తో పాటు ల‌క్నో కోచ్ పై తీవ్రంగా విరుచుకుప‌డ్దాడు. గ్రౌండ్ లోనే ఇద్ద‌రిని తిట్టిప‌డేశాడు. అయితే, దీనికి విరుద్ధ‌మైన స‌న్నివేశం తాజా మ్యాచ్ లో క‌నిపించింది. గ‌త మ్యాచ్ లో కెప్టెన్ పై ఆగ్ర‌హంతో ఊగిపోయిన సంజీవ్ గోయెంకా.. కేఎల్ రాహుల్ పై ప్ర‌శంస‌లు కురిపించాడు. కేఎల్ రాహుల్ చేసిన ప‌నికి అత‌న్ని చ‌ప్ప‌ట్లు కొట్టి ప్ర‌శంస‌లు కురిపించ‌క త‌ప్ప‌లేదు. 

కేఎల్ రాముల్ సూప‌ర్ డైవ్ క్యాచ్.. 

Latest Videos

ఈ మ్యాచ్ లో కేఎల్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి ఓవర్‌లోనే సూప‌ర్ ఫామ్ లో ఉన్న బ్యాట్స్‌మెన్ జేక్ ఫ్రేజర్ వికెట్ పడగొట్టి జట్టు శుభారంభం ల‌భించింది. అయితే మరో ఎండ్‌లో యువకుడు అభిషేక్ పోరెల్ బ్యాట్ తో విధ్వంసం సృష్టిస్తూ హాఫ్ సెంచ‌రీ కొట్టాడు. అయితే, 58 పరుగుల వద్ద బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పోరెల్ ఒక బిగ్ షాట్ ఆడాడు. అయితే,  బంతి కేఎల్ రాహుల్ వైపు వేగంగా వెళ్లింది, క్యాచ్ దాదాపు దూరంగా ఉంది కానీ, కేఎల్ రాహుల్ చిరుతపులిలా చురుకుదనం ప్రదర్శించి క‌ళ్లుచెదిరే క్యాచ్ ప‌ట్టాడు. ఈ అద్భుతమైన క్యాచ్ చూసిన తర్వాత సంజీవ్ గోయెంకా నిలబడి రాహుల్‌కి చప్పట్లు కొట్టడం కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది.

 

A great catch from KL Rahul. pic.twitter.com/NVuph5Obt3

— Mufaddal Vohra (@mufaddal_vohra)

 

A very good catch by Captain KL Rahul. 💥 pic.twitter.com/9SD6Y73Icy

— Johns. (@CricCrazyJohns)

 

IPL 2024 : మ్యాచ్ బాల్‌ను దొంగిలించిన కేకేఆర్ ఫ్యాన్.. చివ‌ర‌కు.. వీడియో 

click me!