IPL 2024: ఐపీఎల్ చివరి రెండు సీజన్ల తర్వాత టీమ్ ఇండియాకు కాబోయే కెప్టెన్‌గా ప్రచారంలో ఉన్న హార్దిక్ పాండ్యా ప్రస్తుతం ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్నాడు. జట్టుతో పాటు అతని ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వస్తున్న క్రమంలో టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
Hardik Pandya - Gautam Gambhir :ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచిన ముంబై ఇండియన్స్ ప్రస్తుతం సీజన్ లో (ఐపీఎల్ 2024) లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ లో ఆడుతోంది. అయితే, తన వ్యక్తిగత ప్రదర్శనతో పాటు ముంబై ఇండియన్స్ టీమ్ ప్రదర్శన దారుణంగా ఉండటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముంబై అభిమానులు సైతం హార్దిక్ ను టార్గెట్ చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ దిగ్గజ ప్లేయర్లు కూడా హార్దిక్ పాండ్యా తీసుకున్న పలు కెప్టెన్సీ నిర్ణయాలు, జట్టు వరుస ఓటములతో తీవ్ర విమర్శల దాడి చేస్తున్నారు.
ఈ క్రమంలోనే దిగ్గజ ప్లేయర్లు ఏబీ డివిలియర్స్, కెవిన్ పీటర్సన్ లు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ, అతని ఆటతీరుపై విమర్శలు గుప్పించారు. అయితే, ఈ విషయంలో హార్దిక్ పాండ్యాకు మద్దతుగా నిలిచాడు టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్. స్పోర్ట్స్‌కీడా షో లో గంభీర్ మాట్లాడుతూ.. క్రీడా నిపుణులు ఏం చెబుతున్నారనేది ముఖ్యం కాదని అన్నారు. "ఇది వారి పని మాత్రమే. ఇలా లేదా అని చెబుతారు. జట్టు ఆటతీరును చూసి మీరు ఏ ఆటగాడి కెప్టెన్సీని నిర్ణయించగలరని నేను ఎప్పుడూ నమ్ముతున్నాను. ఈ ఏడాది ముంబై మంచి ప్రదర్శన కనబరిచి ఉంటే, నిపుణులు వారిని ప్రశంసిస్తూ ఉండేవారు. ముంబైలోని మొత్తం సెటప్ వచ్చే ఏడాది అలాగే ఉండి, జట్టు బాగా రాణిస్తే, అదే నిపుణులు దీనికి విరుద్ధంగా చెబుతారు. అంతిమంగా, ఇది పనితీరుపై ఆధారపడి ఉంటుంది. ముంబై ఫర్వాలేదనిపిస్తే పేలవ ప్రదర్శన గురించి చెబుతున్నారని" అన్నాడు.
undefined
రాహుల్ ద్రవిడ్ తర్వాత టీమిండియా ప్రధాన కోచ్ ఎవరు?
హార్దిక్ కెప్టెన్సీ గురించి గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ, 'హార్దిక్ వేరే ఫ్రాంచైజీ నుండి తిరిగి వచ్చాడనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. అటువంటి పరిస్థితిలో మీకు కొంత సమయం పడుతుంది. అతనికి కొంత సమయం ఇవ్వండి, ఎందుకంటే రెండేళ్లపాటు గుజరాత్‌కు కెప్టెన్‌గా ఉన్న తర్వాత అతను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా వచ్చాడు. అతను బాగా నటించగలిగాడు కానీ చేయలేదు, కానీ అది జరుగుతుంది. అతనికి కొంత సమయం ఇవ్వండి, ప్రతిరోజూ ఎవరో ఒకరు అతనిపై విమర్శలు చేస్తున్నారు. అతడిని విమర్శించే నిపుణులు వారి కెప్టెన్సీ కాలాన్ని గుర్తుపెట్టుకోవాలి. అది ఏబీ డివిలియర్స్ లేదా కెవిన్ పీటర్సన్ కావచ్చు. వారు కెప్టెన్సీలో ప్రత్యేకంగా చేసిందేమీ లేదు. రికార్డులు చూస్తే చాలా దారుణంగా ఉన్నాయంటూ" దిగ్గజ ప్లేయర్లకు క్లాస్ పీకాడు గంభీర్.
డివిలియర్స్ ను టార్గెట్ చేస్తూ.. "ఐపీఎల్‌లో డివిలియర్స్ ఏ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడని నేను అనుకోను. ఐపీఎల్‌లో భారీ స్కోర్లు మినహా ఏమీ సాధించలేకపోయాడు. జట్టు కోణంలో అతను ఏమీ సాధించాడని నేను అనుకోను. హార్దిక్ ఐపీఎల్ విజేత కెప్టెన్. కాబట్టి పోలికల ముందు ఈ విషయాలు గుర్తించాలి" అని గంభీర్ పేర్కొన్నాడు.
Gautam Gambhir questions AB de Villiers and Kevin Pietersen’s performances as a captain 👀🧢
The new episode of Sportskeeda Match Ki Baat releasing today only on YouTube and Facebook 🤩🍿 pic.twitter.com/sFgiGdB3iw
IPL 2024: ఆరంభం నుంచి మాకు మంచి ఊపులేదు.. ముంబై స్టార్ ప్లేయర్ షాకింగ్ కామెంట్స్