IPL Auction: రచిన్ రవీంద్ర కోసం ‘హైదరాబాద్’ భారీగా పెట్టొచ్చు: ఇర్ఫాన్ పఠాన్

By Mahesh K  |  First Published Dec 7, 2023, 11:55 PM IST

న్యూ ఈ సారి సన్ రైజర్స్ హైదరాబాద్ మెరుగైన ఆటగాళ్లను కొనుగోలు చేసి పటిష్టమైన జట్టును కూర్పు చేసుకుని మంచి ప్రదర్శన ఇవ్వాలని భావిస్తున్నది. ఈ జట్టుకు ఆల్ రౌండర్ కొరత ఉన్నది. అందుకే రచిన్ రవీంద్ర కోసం భారీ మొత్తంలో డబ్బులు చెల్లించి సొంతం చేసుకోవడానికి పోటీ పడుతుందని ఇర్ఫాన్ పఠాన్ అన్నారు.
 


హైదరాబాద్: డిసెంబర్ 19వ తేదీన ఐపీఎల్ వేలం జరగనుంది. ఇందులో ఒక్కో ఆటగాడికి ఏ జట్టు.. ఎంత పెట్టొచ్చు అనే అంచనాలు వస్తున్నాయి. మొన్నటి వన్డే వరల్డ్ కప్ సిరీస్‌లో మరికొంత మంది ఆటగాళ్ల సత్తా బయటపడింది. వీరికీ ఈ ఐపీఎల్‌లో డిమాండ్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. ఈ క్రమంలోనే న్యూజిలాండ్ ఆటగాడు రచిన్ రవీంద్ర గురించి చర్చ జరుగుతున్నది. ఆయనను సన్ రైజర్స్ హైదరాబాద్ ఎంతకైనా పెట్టి కొనుగోలు చేస్తుందని తాజాగా భారత మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నారు.

ఎస్ఆర్‌హెచ్ టీమ్‌కు ఆల్ రౌండర్ అవసరం చాలా ఉన్నది. ఇప్పటికే ఈ జట్టుకు హ్యారీ బ్రూక్ దూరం అయ్యారు. అందుకే ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ.. ‘వికెట్లను తీయగల సత్తా ఉన్న స్పిన్నర్‌తోపాటు బ్యాట్‌ను ఝుళిపించే ఆటగాడు నేడు ఎస్ఆర్‌హెచ్‌కు అవసరం. గత సీజన్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్ ఆదిల్ రషీద్‌ను ఆడించింది. కానీ, మళ్లీ ఆయనను రిలీజ్ చేసింది. అయితే, జట్టులో మయాంక్ మార్కండే ఉన్నాడు. కానీ, ఆయన కంటే బెటర్‌గా బౌలింగ్ వేసే వారు అవసరం. వాషింగ్టన్ సుందర్, మార్కో జాన్సన్ రూపంలో ఆల్‌రౌండ్లు ఈ జట్టులో ఉన్నారు. కానీ, రచిన్ రవీంద్రను ఆ జట్టు తీసుకోగలిగితే మరింత పరిపుష్టం అవుతుంది. ఓపెనర్‌గా రచిన్ రవీంద్ర సూపర్ పర్ఫార్మెన్స్ కనబరిచారు. మరో వైపు ఓపెనర్‌గా అభిషేక్ శర్మ మెరుస్తున్నారు. అయితే, రెండో ఓపెనర్, ఆ తర్వాత కూడా బ్యాటింగ్ వైపు సరైన బ్యాకప్ ఈ జట్టుకు లేదనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఎస్ఆర్‌హెచ్ రచిన్ రవీంద్ర కోసం భారీ మొత్తాన్నైనా చెల్లించి కొనుగోలు చేయడానికి పోటీ పడుతుంది’ అని ఇర్ఫాన్ పఠాన్ వివరించారు.

Latest Videos

Also Read: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి స్పీచ్

గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎల్‌లో సన్ రైజర్స్ జట్టు పెద్దగా రాణించింది లేదు. మరీ ముఖ్యంగా గత మూడు సంవత్సరాల్లో జాబితాలో రెండో సగానికి ఈ జట్టు పరిమితం అవుతున్నది. 

click me!