ఐపీఎల్ 2025లో రాజస్థాన్ రాయల్స్‌పై ఇషాన్ కిషన్ విధ్వంసకర సెంచరీ చేయడంతో.. అతన్ని వదులుకోవడం ద్వారా ముంబై ఇండియన్స్ నష్టపోయిందని హర్భజన్ సింగ్ అన్నాడు.
పీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్ గడ్డపై ఇషాన్ కిషన్ అదిరిపోయే బ్యాంటింగ్ కు టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఫిదా అయ్యాడు. సన్ రైజర్స్ అద్భుతమైన ఆటతీరును కనబరిచిందని ప్రశంసలు కురిపించారు.
ఆదివారం జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ జట్టు అద్భుత ఆటతీరుతో రాజస్థాన్ రాయల్స్ ను ఓడించి తిరుగులేని విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ మంచి స్టార్ట్ ఇవ్వగా.. ఆ తర్వాత ఇషాన్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రేక్షకులను అలరించాడు. తొలి బంతికే బౌండరీ కొట్టి ఊపుమీదున్న ఇషాన్.. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు. స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.
పవర్ హిట్టింగ్‌తో 25 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేశాడు. ఆ తర్వాత కేవలం 20 బంతుల్లోనే ఐపీఎల్ సెంచరీ కొట్టాడు.
సెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు ఇషాన్ కిషన్. సన్‌రైజర్స్ 286/6 భారీ స్కోరు చేయగా.. ఇషాన్ 106 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇది టోర్నమెంట్ చరిత్రలో రెండో అత్యధిక స్కోరు కావడం విశేషం.
చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఓడిపోవడంతో.. 26 ఏళ్ల ఇషాన్‌ను వదులుకోవడం ద్వారా ముంబై తప్పు చేసిందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు.
''ఈరోజు ముంబై రెండుసార్లు ఓడిపోయిందని నేను భావిస్తున్నా. వాళ్లు మ్యాచ్ ఓడిపోయారు. అంతేకాదు వాళ్లు వదులుకున్న ఆటగాడు (ఇషాన్) ఎస్ఆర్హెచ్ తరఫున అద్భుతంగా ఆడాడు'' అని హర్భజన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో చెప్పాడు.
సన్‌రైజర్స్ బ్యాటింగ్ చూస్తుంటే.. ఈసారి ఐపీఎల్లో ఆ జట్టు చాలా డేంజరస్‌గా కనిపిస్తోందని హర్భజన్ అన్నాడు.
''ఈ జట్టు చాలా డేంజరస్. ఇషాన్ రీఎంట్రీ ఇచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. అతనికి అభిమానిని అయ్యాను'' అని హర్భజన్ అన్నాడు.
హైదరాబాద్ 286/6 స్కోరుకు సమాధానంగా సంజు శాంసన్ (66), ధ్రువ్ జురెల్ (70) పోరాడినా.. రాజస్థాన్ రాయల్స్ ఓడిపోయింది. చివరి వరకు పోరాడినా 44 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. మరి రానున్న మ్యాచుల్లో సన్ రైజర్స్ ఇదే జోరును కొనసాగిస్తుందా లేదా చూడాలి.