మైదానంలోకి టాస్ కోసం వెళుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడో సీనియర్ క్రికెటర్. గ్రౌండ్ లోనే గుండెపోటుకు గురైన ఆ క్రికెటర్ పరిస్థితి విషమంగా మారింది.
Tamim Iqbal : మన పొరుగుదేశం బంగ్లాదేశ్ లో ఓ క్రికెటర్ మైదానంలోనే గుండెపోటుకు గురయ్యాడు. ఢాకా ప్రీమియర్ లీగ్ మ్యాచ్ జరుగుతుండగా బంగ్లాదేశ్ మాజీ క్రికెట్, టీవీ కామెంటేటర్ తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతడిని హుటాహుటిన హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగానే ఉందని సమాచారం... ప్రస్తుతం అతడికి వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.
తమీమ్ ఇక్బాల్ చాలాకాలం బంగ్లాదేశ్ జట్టలో కీలక ఆటగాడిగా ఉన్నాడు... ఆ జట్టుకు కెప్టెన్‌గా కూడా ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాక కామెంటేటర్ గా మారాడు. ప్రస్తుతం ఢాకా ప్రీమియల్ లీగ్ లో ఆడుతున్నాడు.
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన 36 ఏళ్ళ తమీమ్ లీగ్ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ఇలా అతడు ఢాకా ప్రీమియర్ లీగ్ లో మహమ్మదీయన్ స్పోర్టింగ్ క్లబ్ జట్టుకు కెప్టెన్‌గా ఉన్నాడు. సోమవారం షినెపుకర్ క్రికెట్ క్లబ్ తో మ్యాచ్ కోసం మహ్మదీయన్ టీం తలపడాల్సి ఉంది. ఈ క్రమంలోనే తమీమ్ మ్యా,చ్ ప్రారంభానికి ముందు మైదానంలో అడుగుపెడుతూ ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు.
ఛాతీ పట్టుకుని తమీమ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. నొప్పితో విలవిల్లాడిపోతున్న అతడికి ప్రథమచికిత్స అందించి వెంటనే దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం తమీమ్ పరిస్థితి ఇంకా ప్రమాదకరంగానే ఉంది... అతడికి ఐసియూలో చికిత్స అందిస్తున్నారు.
తమీమ్ ఇక్బాల్ ఢాకా శివారులోని సవార్‌లో ఉన్న ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని, అతను త్వరగా కోలుకోవాలని ప్రార్థన చేయాలని జట్టు అధికారి తారిఖుల్ ఇస్లాం కోరాడు. తమీమ్ ఇక్బాల్ ఆరోగ్యం గురించి బంగ్లాదేశ్ తాత్కాలిక అధ్యక్షుడు మహమ్మద్ యూనుస్ అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. మహమ్మద్ యూనుస్ తరపున డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ అబుల్ కలాం ఆజాద్ మజుందార్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీఈవో నిజామ్ ఉద్దీన్ చౌదరితో మాట్లాడినట్లు సమాచారం.
తమీమ్ ఇక్బాల్ ను మెరుగైన వైద్యంకోసం హెలికాప్టర్ తో తరలించేందకు ప్రయత్నించామని బంగ్లా క్రికెట్ బోర్డ్ చీఫ్ ఫిజిషియన్ దేబాశిష్ చౌదరి తెలిపారు. అయితే అతడి వెంటవెంటనే హార్ట్ స్ట్రోక్స్ రావడంతో ఆ ప్రయత్నాలను విరమించుకుని దగ్గర్లోని హాస్పిటల్లోనే చికిత్స అందించామన్నారు. ప్రస్తుతం అతడు ఢాకా శివారులోని ఫజిలాతున్నెసా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు దేభాశిష్ వెల్లడించారు.
''తమీమ్ ఇక్బాల్‌కు గుండెపోటు వచ్చింది. నాకు తెలిసిన విషయం ఏంటంటే అతని గుండె ఇప్పుడు బాగా పనిచేయడం మొదలుపెట్టిందట. తమీమ్ త్వరగా కోలుకుంటాడు'' అని దేభాశిష్ తెలిపాడు.