Sunrisers Hyderabad : సన్‌రైజర్స్ నన్ను బ్లాక్ చేసింది .. స్క్రీన్‌షాట్లు సహా బయటపెట్టిన డేవిడ్ వార్నర్

By Siva Kodati  |  First Published Dec 19, 2023, 5:27 PM IST

ఐపీఎల్ 2024 వేలం పాట జరుగుతున్న వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా ప్రకటించారు.


ఐపీఎల్ 2024 వేలం పాట జరుగుతున్న వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియాలో బ్లాక్ చేసింది. ఈ విషయాన్ని వార్నర్ స్వయంగా ప్రకటించారు. ఐపీఎల్ 2024 వేలం పాట సందర్భంగా అత్యధిక ధరకు అమ్ముడుపోయిన తన సహచరులు ట్రావిస్ హెడ్, పాట్ కమిన్స్‌లను అభినందించేందుకు ప్రయత్నించగా ఇది వెలుగుచూసింది. దీనికి సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్ (గతంలో ట్విట్టర్) స్క్రీన్ షాట్లను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు. 

వార్నర్ 2014 ఐపీఎల్ వేలం సందర్భంగా ఎస్ఆర్‌హెచ్‌లో చేరాడు. తర్వాత జరిగిన సీజన్‌లలో హైదరాబాద్ తరపున స్టార్ ఆటగాళ్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 2015లో సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అంతేకాదు.. ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు (848) చేసిన ఆటగాళ్లలో రెండవ స్థానం వార్నర్‌దే. 

Latest Videos

అయితే బాల్ ట్యాంపరింగ్ కుంభకోణం తర్వాత 2021లో ఎస్ఆర్‌హెచ్ అతనిని కెప్టెన్సీ నుంచి తప్పించింది, ఆపై 2022 మెగా వేలానికి ముందు వార్నర్‌ను సన్‌రైజర్స్ రిలీజ్ చేసింది. నాటి నుంచి డేవిడ్ వార్నర్  ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడుతున్నాడు.  ఈ ఏడాది ఐపీఎల్ వేలం సందర్భంగా ఎస్ఆర్‌హెచ్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌లను భారీ ధరకు సొంతం చేసుకుంది. పాట్ కమిన్స్ కోసం సీఎస్కే, ఆర్సీబీలతో జరిగిన టగ్ ఆఫ్ వార్‌లో హైదరాబాద్ రూ.20 కోట్లకు దక్కించుకుంది. అనంతరం ట్రావిస్ హెడ్‌ను రూ.6.80 కోట్లకు సొంతం చేసుకుంది. 

తన సహచరులు భారీ ధరకు తన పాత ఐపీఎల్ ఫ్రాంచైజీ దక్కించుకోవడంతో వారిని అభినందించడానికి ట్విట్టర్, ఇన్‌స్ట్రాగ్రామ్‌లను వినియోగించాడు. అయితే అతనిని సన్‌రైజర్స్ హైదరాబాద్ బ్లాక్ చేసింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు వార్నర్. 
 

SRH have blocked David Warner from Twitter/X and Instagram. pic.twitter.com/ZH3NSQ3yzV

— Mufaddal Vohra (@mufaddal_vohra)
click me!