మా జట్టు సమస్య అదే...దాన్ని అధిగమిస్తేనే చెన్నైపై విజయం: భువనేశ్వర్

By Arun Kumar PFirst Published Apr 17, 2019, 7:48 PM IST
Highlights

ఐపిఎల్ 2019 లో ఆరంభంలో వరుస విజయాలతో ఊపుమీదున్నట్లు కనిపించిన సన్ రైజర్స్ రాను రాను గాడితప్పింది. ఎక్కువగా ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో పైనే జట్టు ఆధారపడుతుండటంతో హైదరాబాద్ కు వరుస ఓటములు తప్పడంలేదు. ఈ క్రమంలో బుధవారం సొంత మైదానంలో సన్ రైజర్స్ ఐపిఎల్ లోనే అత్యంత సక్సెస్ ఫుల్ జట్టు చెన్నై తో తలపడనుంది. ఇలా బలమైన జట్టును సొంత మైదానంలో ఎదురిస్తున్న హైదరాబాద్ జట్టు తమ బలహీనతను గుర్తించిందని సన్ రైజర్స్ స్టార్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ పేర్కొన్నాడు. దాన్ని అధిగమిస్తే తాము చెన్నైని సైతం ఓడించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశాడు.
 
ముఖ్యంగా హైదరాబాద్ జట్టును ముందునుండి మిడిల్ ఆర్డర్ సమస్య వేధిస్తోందని భువనేశ్వర్ పేర్కొన్నాడు. అయితే ఈ ఐపిఎల్ సీజన్ ఆరంభంలో జరిగిన మ్యాచుల్లో ఓపెనర్లు వార్నర్, బెయిర్ స్టో రాణించడంతో ఆ సమస్య బయటపడలేదని అన్నారు. కానీ తర్వాత వారు పరుగులు సాధించడంతో విఫలమైన మ్యాచుల్లో బ్యాటింగ్ బాధ్యతను తీసుకోవాల్సిన మిడిల్ ఆర్డర్ చేతులెత్తేసిందని...అందువల్లే తమ జట్టు ఓటమిపాలయ్యిందని అన్నారు. 

ఇప్పటివరకు జరిగిన చాలా మ్యాచుల్లో బ్యాటింగ్ బాధ్యతను ఓపెనర్లే తీసుకున్నారని గుర్తుచేశారు. కొన్ని సమయాల్లోనే మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ కి బ్యాటింగ్ చేసే అవకాశం వచ్చిందని...కానీ అలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ వారు రాణించలేకపోయారన్నారు. ఈ మిడిల్ ఆర్డర్ సమస్యను అధిగమిస్తే తాము ఎలాంటి జట్టునైనా ఓడించగలమని భువీ ధీమా వ్యక్తం చేశాడు. 

చెన్నైతో సొంత మైదానంలో జరగనున్న మ్యాచ్ లో ఈ సమస్యను అధిగమిస్తామన్న నమ్మకం వుందన్నాడు. వరుస విజయాలతో ప్లేఆఫ్ వైపు దూసుకుపోతున్న చెన్నైని ఓడించడం కాస్త కష్టమైనా అసాధ్యం మాత్రం కాదని అన్నాడు. మిడిల్ ఆర్డర్ బ్యాట్ మెన్స్ రాణిస్తే అటు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లోనూ జట్టు సమతూకంగా మారుతుందని...ఈ సమయంలో చెన్నైని ఓడించడం కష్టమేమీ కాదని భుమీ పేర్కొన్నాడు. 
 
click me!