స్టీవ్ స్మిత్‌కి ఆలెన్ బోర్డన్ మెడల్... ఆసీస్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా...

Published : Feb 06, 2021, 04:16 PM IST
స్టీవ్ స్మిత్‌కి ఆలెన్ బోర్డన్ మెడల్... ఆసీస్ వన్డే క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా...

సారాంశం

 126 ఓట్లతో టాప్‌లో నిలిచిన స్టీవ్ స్మిత్... కెరీర్‌లో మూడోసారి ఆలెన్ బోర్డర్ మెడల్... గత ఏడాది 63.11 సగటుతో 568 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్...   ఆసీస్ యంగ్ ఆల్‌రౌండర్ అస్టన్ అగర్‌కి మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు 

ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మెన్ స్టీవ్ స్మిత్ అలెన్ బోర్డర్ మెడల్ పొందాడు. ప్యాట్ కమ్మిన్స్ 114, ఆరోన్ ఫించ్ 97 ఓట్లు పొందగా 126 ఓట్లతో టాప్‌లో నిలిచిన స్టీవ్ స్మిత్... కెరీర్‌లో మూడోసారి ఆలెన్ బోర్డర్ మెడల్ పొందాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్లు మైఖేల్ క్లార్క్, రికీ పాంటింగ్ నాలుగేసి సార్లు ఈ మెడల్ సాధించి, స్మిత్ కంటే ముందున్నారు.

ఈ అవార్డుతో పాటు ఆసీస్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు స్టీవ్ స్మిత్. గత ఏడాది 63.11 సగటుతో 568 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్... వన్డేల్లో ప్రదర్శనకి గానూ వన్డే ప్లేయర్‌ ఆఫ్ ది ఇయర్ అవార్డు దక్కించుకోగా... ఆసీస్ నెం.1 టెస్టు బౌలర్ ప్యాట్ కమ్మిన్స్ టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచాడు.

ఆసీస్ యంగ్ ఆల్‌రౌండర్ అస్టన్ అగర్ మెన్స్ టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలిచాడు. వుమెన్స్ విభాగంలో మూనీ, బెలిందా క్లార్క్ అవార్డు గెలిచింది. గత ఏడాది 42.69 సగటుతో 555 పరుగులు చేసిన మూవీ, టీ20 ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు కూడా గెలిచింది. రాచెల్ హెన్రీ వుమెన్ వన్డే ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచింది.

PREV
click me!

Recommended Stories

IND vs SA : సౌతాఫ్రికా చిత్తు.. భారత్ సూపర్ విక్టరీ.. సిరీస్ మనదే
IND vs SA: హార్దిక్ పాండ్యా ఊచకోత.. 16 బంతుల్లోనే ఫిఫ్టీ, బద్దలైన రికార్డులు ఇవే!