INDvsENG: జో రూట్ జోరు, బెన్ స్టోక్స్ బాదుడు... ఒక్క వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు...

Published : Feb 06, 2021, 11:45 AM IST
INDvsENG: జో రూట్ జోరు, బెన్ స్టోక్స్ బాదుడు... ఒక్క వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు...

సారాంశం

రెండో రోజు లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసిన ఇంగ్లాండ్... జో రూట్ 156 పరుగులు... బెన్ స్టోక్స్ 63 పరుగులు... మొదటి సెషన్‌లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన భారత బౌలర్లు...

వరల్డ్ క్లాస్ టాప్ బౌలింగ్ లైనప్ ఉన్న భారత జట్టు, ఇంగ్లాండ్ జట్టును ఏ మాత్రం ఇబ్బంది పెట్టలేకపోతోంది. శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌లో స్పిన్ బౌలింగ్ ఎదుర్కోవడానికి తెగ ఇబ్బందిపడిన ఇంగ్లాండ్ జట్టు, భారత పర్యటనలో స్పిన్నర్లను ఓ ఆటాడుకుంటోంది. ఫలితంగా రెండో రోజు లంచ్ సమయానికి 3 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది ఇంగ్లాండ్.

జో రూట్ 277 బంతుల్లో 16 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 156 పరుగులు చేయగా... బెన్ స్టోక్స్ 98 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు. బెన్‌స్టోక్స్‌కి ఇది టెస్టుల్లో 23వ హాఫ్ సెంచరీ. ఓవర్‌నైట్ స్కోరు 263/3 వద్ద బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్... రెండో రోజు మొదటి సెషన్‌లో వికెట్ కోల్పోకుండా 92 పరుగులు జోడించింది.

భారత ఫీల్డర్లు క్యాచులను జారవిడచడం కూడా ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కి బాగా కలిసొచ్చింది. ముగ్గురు స్పిన్నర్లతో బరిలో దిగిన భారత జట్టుకి ఆ ప్రయోగం పెద్దగా కలిసి రావడం లేదు. కుల్దీప్ యాదవ్‌కి బదులుగా జట్టులోకి వచ్చిన షాబజ్ నదీం 26 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ తీయలేకపోయా 100 పరుగులు ఇచ్చాడు. 

PREV
click me!

Recommended Stories

ODI World Cup 2027: వరల్డ్ కప్ ఆడటంపై విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు!
IPL 2026: ఫిన్ అలెన్ రచ్చతో పైసా వసూల్ ఎంటర్టైన్మెంట్.. ఈడెన్ గార్డెన్స్‌లో సిక్సర్ల సునామీ