
భారత బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్... ఎట్టకేలకు పెవిలియన్ చేరాడు. 377 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 218 పరుగులు చేసిన జో రూట్... షాబజ్ నదీం బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయి పెవిలియన్ చేరాడు.
477 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది ఇంగ్లాండ్. 82 పరుగులు చేసి అవుటైన బెన్‌స్టోక్స్ తర్వాత క్రీజులోకి వచ్చిన ఓలీ పోప్‌తో కలిసి ఐదో వికెట్‌కి 86 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు జో రూట్. 89 బంతుల్లో 3 ఫోర్లతో 34 పరుగులు చేసిన ఓలీ పోప్, రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు.
ఆ తర్వాత 4 పరుగుల తేడాతో జో రూట్ కూడా పెవిలియన్ చేరాడు. రెండో రోజు మొదటి సెషన్‌లో వికెట్ తీయలేకపోయిన భారత బౌలర్లు, రెండో సెషన్‌లో ఓ వికెట్ తీయగా... మూడో సెషన్‌లో రెండు వికెట్లు దక్కాయి. అయితే ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్ ఇంకా క్రీజులోనే ఉన్నాడు. మిగిలిన నాలుగు వికెట్లను ఎంత త్వరగా అవుట్ చేస్తే, భారత జట్టుకి అంత మంచిది...