ప్రపంచ విజేతలుగా నిలిచిన టీమిండియా జట్టు జాక్‌పాట్ కొట్టేసింది. టీ20 వరల్డ్ కప్-2024లో ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేనకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. విక్టరీ పరేడ్ అనంతరం వాంఖడే స్టేడియంలో రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ చెక్‌ను క్రికెటర్లు అందుకున్నారు.
టీ20 వరల్డ్ కప్-2024 పోరులో భారత్ ఛాంపియన్‌గా నిలిచింది. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించింది. టీ20 ప్రపంచ కప్‌లో 17 ఏళ్ల తర్వాత చాంపియన్‌గా నిలిచిన భారత్‌కు సర్వత్రా అభినందనలు వెల్లువెత్తాయి. భారత ఆటగాళ్లపై పలువురు ప్రముఖులు ప్రశంసల జల్లు కురిపించారు. భారత్‌లో ఆటగాళ్లు అడుగుపెట్టగానే అభిమానులు ఘన స్వాగతం పలికారు. ప్రధాని మోదీ విందు ఇచ్చి అభినందనలు తెలిపారు.
అలాగే, ప్రపంచ విజేతలుగా నిలిచిన టీమిండియా జట్టు జాక్‌పాట్ కొట్టేసింది. టీ20 వరల్డ్ కప్-2024లో ఛాంపియన్‌గా నిలిచిన రోహిత్ సేనకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. విక్టరీ పరేడ్ అనంతరం వాంఖడే స్టేడియంలో రూ.125 కోట్ల ప్రైజ్‌మనీ చెక్‌ను క్రికెటర్లు అందుకున్నారు. ఈ మొత్తంలో ఎవరి వాటా ఎంత అనేది కూడా తేలింది. ఈ భారీ ప్రైజ్‌మనీలో ఆటగాళ్లకు అత్యధిక మొత్తం దక్కగా... సెలక్టర్లు, రిజర్వ్ ప్లేయర్లకు తక్కువ మొత్తం దక్కింది.
ఎవరికి ఎంతంటే...?
రూ.125 కోట్ల ప్రైజ్‌మనీలో టీమిండియా ఆటగాళ్లతో పాటు రిజర్వ్ ప్లేయర్లకూ వాటా దక్కుతుంది. అలాగే, కోచ్‌లు, సెలక్టర్లు, ఫిజియోథెరపిస్టులు, త్రో డౌన్ స్పెషలిస్టులు, ఇతర సిబ్బందికి ప్రైజ్‌మనీ అందుతుంది.
రూ.125కోట్లలో టీమిండియా మెయిన్ ప్లేయర్లకు అత్యధిక మొత్తం రూ.5కోట్ల చొప్పున దక్కనుంది. జట్టులోని 15 మంది సభ్యులైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివమ్ దూబె, అక్షర్ పటేల్, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, జస్‌ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, సంజు శాంస్, యశస్వీ జైస్వాల్‌కు రూ.5కోట్ల చొప్పున నజరానా దక్కుతుంది.
హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్, బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రేకు రూ.2.5కోట్ల చొప్పున ప్రైజ్‌మనీ దక్కనుంది.
ముగ్గురు ఫిజియోథెరపిస్టులు, ముగ్గురు త్రోడౌన్ స్పెషలిస్టులు, ఇద్దరు మెజరర్స్, ఒక స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌కి రూ.2కోట్ల ప్రైజ్‌మనీ అందనుండగా... ఐదురుగు సెలక్టర్లు, నలుగురు రిజర్వ్ ప్లేయర్లకు తలా కోటి రూపాయలు ప్రైజ్ మనీ అందుతుంది.