టీ20 ప్రపంచకప్‌ ఫైనల్ కాదు.. నా లైఫ్‌లో ముఖ్యమైన క్యాచ్‌ అదే.. సూర్య‌కుమార్ యాద‌వ్

By Mahesh Rajamoni  |  First Published Jul 9, 2024, 2:26 PM IST

Suryakumar Yadav Most Important Catch : భారత స్టార్ క్రికెట్ సూర్యకుమార్ యాదవ్ అద్భుత‌మైన క్యాచ్ తో డేవిడ్ మిల్ల‌ర్ ను ఔట్ చేసి టీమిండియాకు టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ట్రోఫీని అందించ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. ఇది క్రికెట్ హిస్ట‌రీలో నిలిచిపోయే క్యాచ్ గా నిలిచింది. కానీ, దీనికంటే ముఖ్య‌మైన క్యాచ్ ఉంద‌ని సూర్య ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు.
 


Suryakumar Yadav Most Important Catch :  వెస్టిండీస్ వేదిక‌గా జ‌రిగిన టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024 ఫైన‌ల్లో సౌతాఫ్రికాపై టీమిండియా సూప‌ర్ విక్ట‌రీతో ఛాంపియ‌న్ గా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో స్ట‌న్నింగ్ క్యాచ్ తో టీమిండియా విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు సూర్య‌కుమార్ యాద‌వ్. అత‌ను అందుకున్న క్యాచ్ కాదు ఐసీసీ ట్రోఫీ.. ఈ క్రమంలోనే తాజాగా భారత క్రికెట్ స్టార్ సూర్యకుమార్ యాదవ్ తన అభిమానులకు సోషల్ మీడియాలో ఇది మ‌రిచిపోలేని క్యాచ్ అని చెప్పాడు. టీ20 వరల్డ్ కప్ 2024 ఫైనల్‌లో డేవిడ్ మిల్లర్‌ను అవుట్ చేయడానికి సూర్యకుమార్ బౌండరీ వద్ద అద్భుతమైన క్యాచ్ పట్టాడు, ఇది మ్యాచ్‌పై భారత్ పట్టును బలోపేతం చేసింది. భారత్‌ను ప్రపంచ ఛాంపియన్‌గా నిలపడంలో ఈ క్యాచ్‌ దోహదపడింది. అయితే, దీని కంటూ ముఖ్య‌మైన క్యాచ్ ను దీని కంటే ముందే ప‌ట్టుకున్నాన‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు.

సూర్య కుమార్ యాద‌వ్ ఏం చెప్పాడంటే.. 

Latest Videos

undefined

సూర్యకుమార్ యాదవ్ తన భార్య దేవిషా శెట్టితో కలిసి కేక్ కట్ చేస్తున్న ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. టీ20 ప్రపంచకప్‌లో పట్టిన క్యాచ్‌ని కాదని, తన భార్య దేవిషా శెట్టిని పెళ్లి చేసుకోవడం అత్యంత ముఖ్యమైన క్యాచ్‌గా అభివర్ణించాడు. సూర్యకుమార్ త‌న పోస్టులో.. 'నిన్న ఆ క్యాచ్‌కి 8 రోజులు అయ్యింది, కానీ నా అత్యంత ముఖ్యమైన క్యాచ్ నిజానికి 8 సంవత్సరాల క్రితం ప‌ట్టుకున్నాను!' అని త‌న భార్యపై ఉన్న ప్రేమ‌ గురించి ప్ర‌స్తావించారు. ఈ జంట తమ 8వ వివాహ వార్షికోత్సవాన్ని 7 జూలై 2024న జరుపుకుంది. ఈ క్ర‌మంలోనే సూర్య పంచుకున్న ఈ పోస్టుకు మిలియన్ కంటే ఎక్కువ లైక్‌లు వచ్చాయి.

స్ట‌న్నింగ్ క్యాచ్ తో ఫైనల్ హీరో అయ్యాడు

టీ20 ప్ర‌పంచ క‌ప్ 2024  ఫైనల్‌లో చివరి ఓవర్‌లో దక్షిణాఫ్రికాకు 16 పరుగులు కావాల్సిన సమయంలో, డేవిడ్ మిల్లర్‌ను లాంగ్-ఆఫ్‌లో సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన క్యాచ్ తో పెవిలియ‌న్ కు పంపాడు. సూర్య క్యాచ్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యా అద్భుతమైన డెత్ బౌలింగ్, అంతకుముందు, విరాట్ కోహ్లీ హీరో ఇన్నింగ్స్ భార‌త్ ను ఛాంపియ‌న్ గా నిల‌బెట్టాయి. ఈ మ్యాచ్ లో భారత్ ఏడు పరుగుల తేడాతో గెలిచింది. రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను అందుకుంది. 

T20 వరల్డ్ కప్ ప్రైజ్‌మనీలో రోహిత్, కోహ్లీకి ఎంత వస్తుందో తెలుసా?

click me!