IPL 2024, SRH vs RR: ఐపీఎల్ 2024 క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్ లో ఏ జట్టు గెలిస్తే అది ఫైనల్‌కు చేరుకుంటుంది.
Rajasthan Royals vs Sunrisers Hyderabad : ఐపీఎల్ 2024 ఫైనల్ బెర్తు కోసం క్వాలిఫయర్-2 మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) జట్లు తలపడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 7:30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరగనున్న ఈ మ్యాచ్‌లో ఏ జట్టు గెలిస్తే అది ఐపీఎల్ 2024 ఫైనల్‌కు చేరుకుంటుంది. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టు మే 26న చెన్నైలో కోల్‌కతా నైట్ రైడర్స్ (కెకెఆర్)తో ఐపీఎల్ ఫైనల్ ఆడుతుంది. అయితే, క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వర్షం కురిసి మ్యాచ్ మొత్తం రద్దు అయితే ఫైనల్‌కు ఏ జట్టు వెళ్తుంది? వర్షంతో ఏ టీమ్ కు లాభం? ఫైనల్ అవకాశాలు ఎవరికీ ఎలా ఉన్నాయి?
క్వాలిఫయర్-2 వాష్ అవుట్ అయితే.. ?
undefined
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) vs రాజస్థాన్ రాయల్స్ (ఆర్ఆర్) క్వాలిఫయర్-2 మ్యాచ్‌కు రిజర్వ్ డే లేదు. క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వర్షం కురిస్తే ఓవర్లను తగ్గించి మ్యాచ్ ను నిర్వహిస్తారు. దీనికి తోడూ వర్షం అంతరాయం కలిగించే మ్యాచ్‌లో అంపైర్‌లు 120 నిమిషాల అదనపు సమయం కేటాయించవచ్చు. దీని కారణంగా మ్యాచ్‌ను కనీసం 5 ఓవర్లు ఉండేలా ప్రయత్నాలు చేస్తారు. ఇది కూడా సాధ్యం కాకపోతే సూపర్ ఓవర్ ద్వారా మ్యాచ్ ఫలితం తేలనుంది. సూపర్ ఓవర్ కూడా జరగని పరిస్థితుల్లో ఈ సీజన్ లో ఆయా జట్లు సాధించిన పాయింట్లను పరిగణలోకి తీసుకుంటారు. ఈ పరిస్థితుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది.
హైదరాబాద్ ఆడకుండానే ఫైనల్ కు..
క్వాలిఫయర్-2 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) జట్టు ఫైనల్‌కు చేరుకుంటుంది. ఎందుకంటే, లీగ్ దశ ముగిసే సమయానికి సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. హైదరాబాద్ జట్టు 14 మ్యాచ్‌లలో +0.414 రన్ రేట్‌తో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో ఉంది. అదే సమయంలో, రాజస్థాన్ రాయల్స్ జట్టు +0.273 రన్ రేట్‌తో 14 మ్యాచ్‌లలో 17 పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉంది. నిబంధనల ప్రకారం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉండడంతో మ్యాచ్ రద్దయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఫైనల్‌కు చేరుకుంటుంది.
మ్యాచ్ సమయంలో వర్షం కురుస్తుందా?
ప్రస్తుతం అందుతున్న వాతావరణ శాఖ నివేదికల ప్రకారం.. మే 24న చెన్నైలో సన్‌రైజర్స్ హైదరాబాద్ vs రాజస్థాన్ రాయల్స్ క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో వర్షం పడే అవకాశం తక్కువ. మే 24న కేవలం 2 శాతం మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే, మ్యాచ్ సమయంలో మేఘావృతమై ఉండవచ్చు. ఈ సమయంలో చెన్నైలో ఉష్ణోగ్రత 30 నుండి 35 డిగ్రీల మధ్య ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో అభిమానులు నిరాశ చెందాల్సిన అవసరం లేదు.
ఓ విరాట్ కోహ్లీ ముందు నువ్వు ఆ పనిచేయ్యవయ్యా సామి.. అప్పుడే ఐపీఎల్ కప్పు గెలుస్తావ్.. !