Latest Videos

ఓ విరాట్ కోహ్లీ ముందు నువ్వు ఆ ప‌నిచేయ్య‌వ‌య్యా సామి.. అప్పుడే ఐపీఎల్ క‌ప్పు గెలుస్తావ్.. !

By Mahesh RajamoniFirst Published May 24, 2024, 11:10 AM IST
Highlights

Virat Kohli : ఐపీఎల్ 2024 ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో ఓడిన త‌ర్వాత రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఈ సీజ‌న్ నుంచి ఔట్ అయింది. ఆరెంజ్ క్యాప్ విన్నింగ్ రేసులో టాప్ లో ఉన్న విరాట్ కోహ్లీకి ఐపీఎల్ ట్రోఫీ ఈ సారి కూడా అసాధ్యంగా మిగిలిపోయింది.
 

IPL 2024 : ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2024 (ఐపీఎల్ 2024) ఎలాగైనా క‌ప్పు గెల‌వాల‌నుకున్నరాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో రాజ‌స్థాన్ రాయ‌ల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. వ‌రుస ఓట‌ముల మ‌ధ్య టీమ్ ప‌నైపోయింది అనుకున్న టైమ్ లో వ‌రుస‌గా ఆరు విజ‌యాలు సాధించి ఫ్లేఆఫ్స్ లోకి వ‌చ్చింది ఆర్సీబీ టీమ్. కీల‌కమైన మ్యాచ్ లో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో చెత్త ప్ర‌ద‌ర్శ‌న చేసి ఆర్సీబీ ఓట‌మిపాలైంది. 4 వికెట్ల తేడాతో బెంగ‌ళూరుపై రాజ‌స్థాన్ రాయ‌ల్స్ విజ‌యం సాధించింది. దీంతో ఐపీఎల్ 2024 నుంచి ఆర్సీబీ ఔట్ కాగా, క్వాలిఫ‌య‌ర్ 2 లో హైద‌రాబాద్ లో రాజస్థాన్ త‌ల‌ప‌డ‌నుంది.

ఈ క్ర‌మంలోనే విరాట్ కోహ్లీ బలమైన ఫ్రాంచైజీలో చేరాలని ఇంగ్లాండ్ లెజెండ్ కెవిన్ పీటర్సన్ చేసిన కామెంట్స్ వైర‌ల్ గా మారాయి. విరాట్ కోహ్లీ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ని విడిచిపెట్టి , బలమైన ఫ్రాంచైజీ టీమ్ లో చేరాల‌నీ, అప్పుడే తాను త‌న తొలి టైటిల్‌ను గెలుచుకునే అవకాశం ఉందని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ అభిప్రాయపడ్డాడు. కింగ్ విరాట్ కోహ్లీ ఆర్సీబీకి గుడ్ చెప్పి మ‌రో టీమ్ తో జ‌త‌క‌ట్టాల‌ని  సూచించాడు. ఫాఫ్ డు ప్లెసిస్ కెప్టెన్సీలో ఆర్సీబీ వ‌రుసగా ఆరు మ్యాచ్‌లు గెలిచి ప్లేఆఫ్స్‌లోకి అద్భుతంగా ప్రవేశించింది. అయితే, ఎలిమినేట‌ర్ మ్యాచ్ లో చ‌తికిల ప‌డింది. 

ఐపీఎల్ హిస్ట‌రీలో ఒకేఒక్క‌డు కింగ్ కోహ్లీ స‌రికొత్త రికార్డు

ఐపీఎల్ చరిత్రలో ఒకే ఫ్రాంచైజీ కోసం మొత్తం 17 సీజన్లు ఆడిన ఏకైక ఆటగాడు కింగ్ కోహ్లీ. అతను ఒకసారి ఆరెంజ్ క్యాప్‌ను గెలుచుకున్నాడు. ఐపీఎల్ 2024 సీజ‌న్ లో కూడా  ఆరెంజ్ క్యాప్ అవార్డును గెలుచుకునే అవ‌కాశ‌ముంది. ఐపీఎల్ 8000 ప‌రుగులు పూర్తి చేసిన తొలి బ్యాట‌ర్ గా రికార్డు సృష్టించాడు. అలాగే, ఐపీఎల్ లో అత్య‌ధిక సెంచ‌రీలు సాధించిన ప్లేయ‌ర్ కూడా విరాట్ కోహ్లీనే. ప్ర‌తి సీజ‌న్ లో మంచి ప్ర‌ద‌ర్శ‌న చేస్తున్నాడు. కీల‌క మ్యాచ్ ల‌లో ఇత‌ర ప్లేయ‌ర్లు రాణించ‌క‌పోవ‌డంతో ఆర్సీబీ ఇప్ప‌టివ‌ర‌కు ఐపీఎల్ టైటిల్ ను సాధించ‌లేక‌పోయింది.

కెవిన్ పీట‌ర్స‌న్  మాట్లాడుతూ.. ఐపీఎల్ ట్రోఫీని అందుకోవడానికి సహకరించే జట్టులో ఆడేందుకు విరాట్ కోహ్లీ అర్హుడని అన్నాడు. 2009, 2010లో ఆర్సీబీలో కోహ్లితో కలిసి ఆడిన పీటర్సన్..  ఇప్ప‌టివ‌ర‌కు సాగిన ఐపీఎల్ 17 సీజన్లలో టైటిల్ ను అందుకోలేక‌పోయిన ఆర్సీబీ పరాజయాలను చవిచూసిన కోహ్లీ తన ఐపీల్ జట్టును మార్చాలని గట్టిగా సూచించాడు. స్పోర్ట్స్‌కీడా నివేదిక‌ల ప్రకారం.. "నేను ఇంతకు ముందే చెప్పాను.. నేను మళ్ళీ చెబుతాను - ఇతర క్రీడలలోని గొప్ప ఆటగాళ్ళు, జట్లను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లి కీర్తిని పొందారు. త‌న జ‌ట్టుకోసం కింగ్ కోహ్లీ ప్ర‌య‌త్నిస్తూనే ఉన్నాడు. మెరుగైన ప్ర‌ద‌ర్శ‌న‌లు చేస్తునే ఉన్నాడు. ఆరెంజ్ క్యాప్ లు గెలుచుకుంటూనే ఉన్నాడు. ఒక జ‌ట్టుగా మ‌ళ్లీ ఆర్సీబీ విఫ‌ల‌మైంది. కోహ్లీ ట్రోఫీని పొందడానికి సహాయపడే జట్టులో ఆడటానికి అర్హుడు" అని పీట‌ర్స‌న్ అన్నాడు. 

నా ఆట గురించి నాకు తెలుసు.. ఎవ‌రికీ చెప్పాల్సిన అవ‌స‌రం లేదు : విరాట్ కోహ్లీ

click me!