SRHvsKKR: టాస్ గెలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్... కేన్ విలియంసన్‌కి నిరాశ...

By team teluguFirst Published Apr 11, 2021, 7:12 PM IST
Highlights

టాస్ గెలిచి, ఫీల్డింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్...

జానీ బెయిర్ స్టో, రషీద్ ఖాన్, మహ్మద్ నబీలకు అవకాశం... కేన్ విలియంసన్‌కి తుదిజట్టులో దక్కని చోటు...

IPL 2021 సీజన్‌లో నేటి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కత్తా నైట్‌రైడర్స్ మధ్య మ్యాచ్‌లో టాస్ గెలిచిన డేవిడ్ వార్నర్, ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కేకేఆర్ తొలుత బ్యాటింగ్ చేయనుంది.
గత సీజన్‌లో ఈ రెండు జట్ల మధ్య జరిగిన రెండు మ్యాచుల్లోనూ కేకేఆర్‌కే విజయం దక్కింది.

రెండో మ్యాచ్ సూపర్ ఓవర్‌కి దారి తీసినా, కోల్‌కత్తా విజయం దక్కించుకుంది. హర్భజన్ సింగ్, కేకేఆర్ తరుపున ఆరంగ్రేటం చేస్తున్నాడు. మరోవైపు జానీ బెయిర్‌స్టో మంచి ఫామ్‌లో ఉండడంతో కేన్ విలియంసన్‌ను పక్కనబెట్టాడు డేవిడ్ వార్నర్. 

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు:
డేవిడ్ వార్నర్, బెయిర్ స్టో, వృద్ధిమాన్ సాహా, మనీశ్ పాండే, విజయ్ శంకర్, అబ్దుల్ సమద్, మహ్మద్ నబీ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, సందీప్ శర్మ

కోల్‌కత్తా నైట్‌రైడర్స్ జట్టు:
శుబ్‌మన్ గిల్, రాహుల్ త్రిపాఠి, నితీశ్ రాణా, ఇయాన్ మోర్గాన్, దినేశ్ కార్తీక్,  ఆండ్రూ రస్సెల్, షకీబ్ అల్ హసన్, ప్యాట్ కమ్మిన్స్, హర్భజన్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి.

click me!