ఐపిఎల్ 2021: ధోనీకి రూ.12 లక్షల జరిమానా, మరో వైపు ఓటమి పరాభవం

By telugu teamFirst Published Apr 11, 2021, 10:12 AM IST
Highlights

ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఓటమి ఓ వైపు బాధపడుతున్న స్థితిలోనే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి జరిమానా పడింది. స్లో ఓవరు రేటుకు గాను ధోనీకి రూ.12 లక్షల జరిమానా విధించారు.

ముంబై: ఐపిఎల్ 2021లో భాగంగా శనివారం జరిగిన మ్యాచులో రిషబ్ పంత్ జట్టుపై ఓటమి పాలైన పరాభవం ఎదురైన నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి మరో చిక్కు వచ్చి పడింది. వాంఖడే స్టేడియంలో వాంఖడే మైదానంలో జరిగిన మ్యాచులో స్లో ఓవరు రేటుగాను ధోనీకి జరిమానా పడింది.

స్లో ఓవరు రేటుకు ధోనీకి రూ.12 లక్షల జరిమానా పడింది. ఐపిఎల్ ప్రవర్తనా నియమావళి మేరకు ధోనీకి ఇది మొదటి తప్పు. దీంతో ధోనీకి రూ.12 లక్షల జరిమానా విదించారు. చైన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ క్యాపిటల్స్ మీద ఏడు వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. 

ఢిల్లీ ఓపెనర్లు శిఖర్ ధావన్, పృథ్వీషా చెన్నై బౌలర్లను ఉతికి ఆరేశారు. శిఖర్ ధావన్ 85 పరుగులు చేయగా, పృథ్వీషా 72 పరుగులు చేశాడు. దాంతో చెన్నై తమ ముందు ఉంచిన 189 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ అలవోకగా ఛేదించింది. చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ రెండు వికెట్లు తీశాడు. కానీ 3.4 ఓవర్లలో 53 పరుగులు సమర్పించుకున్నాడు.

ఇతర బౌలర్ల కన్నా డ్వైన్ బ్రేవో బౌలింగ్ మెరుగ్గా ఉంది. బ్రేవో 4 ఓవర్లు వేసి ఒక వికెట్ తీసుకున్నాడు. కేవలం 28 పరుగులు మాత్రమే ఇచ్చాడు. పిచ్ మీద తేమ కారణంగా తాము ఓడిపోయామని ధోనీ అన్నాడు. అదే సమయంలో తమ బౌలర్ల ప్రదర్శన పేలవంగా ఉందని అన్నాడు. ఢిల్లీ బౌలర్లు అద్భుతంగా బంతులు వేశారని ప్రశంసించాడు. 

click me!