SRH vs CSK : ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ vs చెన్నై జట్లు 18వ మ్యాచ్ లో తలపడ్డాయి. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇన్నింగ్స్ లో శివం దూబే శివాలెత్తాడు. శివమ్ కాదు.. సిక్సర్ల దూబే నంటూ దుమ్మురేపాడు.
SRH vs CSK - IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) vs చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య ఐపీఎల్ 2024 18వ మ్యాచ్ లో హైదరాబాద్ చెన్నై బౌలింగ్ ను ఉతికిపారేసింది. సూపర్ ఇన్నింగ్స్ తో మరోసారి అభిషేక్ శర్మ స్టేడియాన్ని షేక్ చేశాడు. అంతకుముందు ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇన్నింగ్స్ లో శివమ్ దూబే శివాలెత్తాడు. ధనాధన్ ఇన్నింగ్స్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది.
సీఎస్కే స్టార్ ఆల్ రౌండర్ శివమ్ దూబే బ్యాట్ తో పిడుగులా విరుచుకుపడ్డాడు. దూబే మైదానంలో అడుగుపెట్టగానే ఫోర్లు, సిక్సర్లు బాదుతూ దుమ్మురేపాడు. ఈ మ్యాచ్‌లో శివమ్ దూబే కేవలం 5 పరుగుల తేడాతో హాఫ్ సెంచరీని కోల్పోయాడు, అయితే అతను తన ఇన్నింగ్స్‌తో అందరి హృదయాలను గెలుచుకున్నాడు. తన సూపర్ ఇన్నింగ్స్ లో రాబోయే ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ తరఫున జట్టులో ఉండాల్సిందేనని సీనియర్లతో పాటు క్రికెట్ లవర్స్ డిమాండ్ చేస్తున్నారు.
ఉప్పల్‌లో కొడితే తుప్పల్లో పడ్డాయి.. చెన్నైని షేక్ చేసిన అభిషేక్ శర్మ !
శివమ్ దూబే అద్భుతంగా బ్యాటింగ్ చేసి 45 పరుగులు చేశాడు . హైదరాబాద్‌పై దాదాపు 190 స్ట్రైక్ రేట్‌తో 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. దూబే, అజింక్యా మధ్య 65 పరుగుల అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఏర్పడింది. శివమ్ దూబే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. ధనాధన్ ఇన్నింగ్స్ తో సీఎస్కేకు 200 పరుగులు సాధించిపెడతాడని అనుకుంటున్న తరుణంలో హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతికి శివమ్ దూబేని అవుట్ చేశాడు. కమ్మిన్స్ బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ కు క్యాచ్ రూపంలో దూబే దొరికిపోయాడు.
Muscled not once but TWICE 💥💥
Shivam Dube on a roll in Hyderabad! 🔥
Watch the match LIVE on and 💻📱 | | pic.twitter.com/0odsO9hgAv
హార్దిక్ పాండ్యా పూజలు ఫలిస్తాయా.. ముంబై గెలుపు ట్రాక్ లోకి వస్తుందా..?