
SRH vs CSK - IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) vs చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య ఐపీఎల్ 2024 18వ మ్యాచ్ లో హైదరాబాద్ చెన్నై బౌలింగ్ ను ఉతికిపారేసింది. సూపర్ ఇన్నింగ్స్ తో మరోసారి అభిషేక్ శర్మ స్టేడియాన్ని షేక్ చేశాడు. ఉప్పల్లో కొడితే తుప్పల్లో పడ్డాయి అనే విధంగా ఉన్నంత సేపు సిక్సర్ల మోత మోగించాడు. రెండో ఓవర్ లో మరోసారి దుమ్మురేపుతూ పరుగుల వరద పారించాడు.
ఒకే ఓవర్ లో ఏకంగా 27 పరుగులు పిండుకున్నాడు అభిషేక్ శర్మ. ఈ మ్యాచ్ రెండో ఓవర్ లో చౌదరి వేసిన ఓవర్ లో అభిషేక్ శర్మ కళ్లుచెదిరే షాట్స్ ఆడాడు. ఒకే ఓవర్ లో 4, 0, 6, 0, నోబాల్ 6, 6, 4 తో గ్రౌండ్ ను హోరెత్తించాడు. మూడు సిక్సర్లు, రెండో ఫోర్లు బాది చౌదరి బౌలింగ్ ను ఉతికిపారేశాడు. దీంతో నోబాల్ తో కలిపి హైదరాబాద్ కు రెండో ఓవర్ లో 27 పరుగులు వచ్చాయి. ఆ తర్వాతి ఓవర్ లో ఒక సిక్సర్, ఫోర్ కోట్టాడు. మరో భారీ షాట్ ఆడే క్రమంలో 37 పరుగులు చేసిన తర్వాత అభిషేక్ శర్మ ఔట్ అయ్యాడు. అభిషేక్ శర్మ తన ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు బాదాడు.
డ్రెస్సింగ్ రూమ్ లో బాగులేదు.. ముంబై ఇండియన్స్ కు రోహిత్ శర్మ గుడ్ బై !
ఈ మ్యాచ్ లో హైదరాబాద్ కు ఓపెనర్లు మంచి శుభారంభం అందించడంతో పవర్ ప్లే లో మరో రికార్డు స్కోర్ చేసింది. పవర్ ప్లే లో హైదరాబాద్ టీమ్ ఒక వికెట్ కోల్పోయి 78 పరుగులు సాధించింది.
ఐపీఎల్ లో హైదరాబాద్ టాప్-5 పవర్ ప్లే స్కోర్స్
81/1 vs ఎంఐ, హైదరాబాద్, 2024
79/0 vs కేకేఆర్, కోల్‌కతా, 2017
78/1 vs సీఎస్కే, హైదరాబాద్, 2024
77/0 vs పీబీకేఎస్, హైదరాబాద్, 2019
77/0 vs డీసీ, దుబాయ్, 2020
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు సాధించింది. శివం దూబే ధనాధన్ ఇన్నింగ్స్ తో అదరగొట్టి సిక్సర్ల దూబే అని నిరూపించాడు.
SURYAKUMAR YADAV: వచ్చేశాడు.. అదరగొడుతానంటున్న ముంబై సూపర్ స్టార్.. !