
SRH vs CSK - IPL 2024 : సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) vs చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) మధ్య ఐపీఎల్ 2024 18వ మ్యాచ్ లో హైదరాబాద్ చెన్నై బౌలింగ్ ను ఉతికిపారేసింది. మరోసారి అభిషేక్ శర్మ స్టేడియాన్ని షేక్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్ లో ఐడెన్ మార్క్రమ్ బిగ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ ను హైదరాబాద్ టీమ్ 6 వికెట్ల తేడాతో చిత్తుచేసింది. చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. 166 పరుగుల టార్గేట్ తో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ 4 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై ఇన్నింగ్స్ లో శివమ్ దూబే శివాలెత్తాడు. ధనాధన్ ఇన్నింగ్స్ లో సిక్సర్ల వర్షం కురిపించాడు. దాదాపు 190 స్ట్రైక్ రేట్‌తో 24 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేశాడు. దూబే, అజింక్యా మధ్య 65 పరుగుల అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఏర్పడింది. శివమ్ దూబే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు.. ధనాధన్ ఇన్నింగ్స్ తో సీఎస్కేకు 200 పరుగులు సాధించిపెడతాడని అనుకుంటున్న తరుణంలో హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ ఇన్నింగ్స్ 14వ ఓవర్ నాలుగో బంతికి శివమ్ దూబేని అవుట్ చేశాడు.
హైదరాబాద్ 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ విజయంలో ఐపీఎల్ 2024లో రెండు గెలుపును నమోదుచేసింది. పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు స్థానాల్లోకి ప్రవేశించడానికి సహాయపడింది. ఐపీఎల్ 2024 సీజన్‌లో ఆకట్టుకునే ఆరంభం తర్వాత చెన్నై సూపర్ కింగ్స్ వరుసగా రెండో ఓటమిని నమోదు చేసింది .మరో సారి చెన్నై ఓపెనర్లు రచిన్ రవీంద్ర, రుతురాజ్ గైక్వాడ్ పటిష్ట ఆరంభం కోసం పోరాడారు. అనుభవజ్ఞుడైన భారత బౌలర్ భువనేశ్వర్ కుమార్ నాలుగో ఓవర్‌లో రచినిన్‌ను ఔట్ చేశాడు.
శివమ్ దూబే ధమాకా ఇన్నింగ్స్.. సిక్సర్ల దూబేగా అదరగొట్టాడు..