ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా సౌతాఫ్రికా కోచ్..! రేసునుంచి అతడు తప్పుకోవడంతో..

Published : Sep 15, 2022, 02:50 PM IST
ముంబై ఇండియన్స్ హెడ్‌కోచ్‌గా సౌతాఫ్రికా కోచ్..! రేసునుంచి అతడు తప్పుకోవడంతో..

సారాంశం

Mumbai Indians: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న  ముంబై ఇండియన్స్ కు  హెడ్ కోచ్ గా ఉన్న మహేళ జయవర్దెనే   ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఆ స్థానాన్ని ఇప్పుడు...

శ్రీలంక మాజీ ఆటగాడు  మహేళ జయవర్దెనే తర్వాత  ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా వ్యవహరించేదెవరనే విషయంపై  ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  జయవర్దెనే స్థానాన్ని దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు హెడ్ కోచ్  మార్క్ బౌచర్ భర్తీ చేయనున్నట్టు తెలుస్తున్నది.  బౌచర్..ప్రస్తుతం సౌతాఫ్రికాకు హెడ్ కోచ్ గా ఉన్నా.. టీ20 ప్రపంచకప్ తర్వాత ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నాడు.  అయితే అతడు ముంబై ఇండియన్స్  కు దక్షిణాఫ్రికా క్రికెట్ లీగ్ లో ఉన్న ఎంఐ కేప్‌టౌన్ కు హెడ్ కోచ్ గా ఎంపికవుతాడని అంతా ఆశించారు. 

కానీ.. కేప్‌టౌన్ జట్టుకు బౌచర్ ను కాకుండా ఆసీస్ మాజీ ఆటగాడు సైమన్ కటిచ్ ను ముంబై ఎంపిక చేసింది.  దీంతో మార్క్ బౌచర్ ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా రానున్నాడని సోషల్ మీడియాలో   గుసగుసలు వినిపిస్తున్నాయి.  బౌచర్ ఎంపిక  దాదాపు ఖాయమైపోయిందని.. ఒక అధికారిక ప్రకటనే మిగిలిపోయిందని  తెలుస్తున్నది. 

కేప్‌టౌన్ జట్టుకు  సైమన్ కటిచ్ ను హెడ్ కోచ్ గా  నియమిస్తూ ముంబై యాజమాన్యం  తాజాగా ఒక ప్రకటన విదుదలచేసింది. కటిచ్ తో పాటు  సౌతాఫ్రికా మాజీ బ్యాటర్ హషీమ్ ఆమ్లా ను తమ బ్యాటింగ్ కోచ్ గా నియమించుకుంది.   వీరిద్దరే గాక  ఫీల్డింగ్ కోచ్ గా జేమ్స్ పామెంట్, జట్టు మేనేజర్ గా రాబిన్ పీటర్సన్ ను  నియమిస్తూ   ఎంఐ కేప్‌టౌన్ ఫ్రాంచైజీ  నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ట్విటర్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

 

కటిచ్.. కేప్‌టౌన్ కు కోచ్ గా వెళ్లనుండటంతో ముంబై ఇండియన్స్ కు ఖాళీగా ఉన్న హెడ్ కోచ్ బాధ్యతలను  బౌచర్ కే అప్పజెప్పేందుకు ముంబై యాజమాన్యం కూడా ఆసక్తిగా ఉందని టాక్ వినిపిస్తున్నది. గతంలో  ఐపీఎల్ లో  బౌచర్ కోల్కతా నైట్ రైడర్స్ తరఫున  కోచింగ్ సిబ్బందిలో పనిచేశాడు. 2019 నుంచి దక్షిణాఫ్రికా జట్టుకు హెడ్ కోచ్ గా పనిచేస్తున్నాడు. 

 

ఇదిలాఉండగా  ఐపీఎల్ తో పాటు దక్షిణాఫ్రికా టీ20 లీగ్, ఇంటర్నేషనల్ టీ20 లీగ్ (యూఏఈ) లలో పెట్టుబడులు పెట్టడంతో ముంబై ఇండియన్స్ కు హెడ్ కోచ్ గా ఉన్న జయవర్దెనేను  గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ గా, జహీర్ ఖాన్ ను  గ్లోబల్  హెడ్ ఆఫ్ క్రికెట్  డెవలప్మెంట్ గా  నియమించిన విషయం తెలిసిందే.  వీళ్లిద్దరూ ముంబై ఇండియన్స్ లో మూడు ఫ్రాంచైజీలకు కీలక సభ్యులుగా పనిచేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

IND vs PAK U19 Final : దాయాదుల సమరం.. ఆసియా కప్ ఫైనల్లో గెలిచేదెవరు? మ్యాచ్ ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు?
T20 World Cup: జితేష్ శర్మ చేసిన తప్పేంటి? టీమ్‌లో ఆ ఇద్దరికి చోటు.. అసలు కారణం ఇదే !