గుండెపోటుతో పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రౌఫ్ కన్నుమూత..

Published : Sep 15, 2022, 08:27 AM IST
గుండెపోటుతో పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రౌఫ్ కన్నుమూత..

సారాంశం

మాజీ అంపైర్ అసద్ రవూఫ్ గుండెపోటు కారణంగా 66 సంవత్సరాల వయస్సులో మరణించాడు. రవూఫ్ తన షాపు మూసేసి ఇంటికి తిరిగి వస్తుండగా,  ఛాతీలో నొప్పి రావడంతో హఠాన్మరణం పొందారు.  

పాకిస్తాన్ : క్రికెట్ లో విషాదం నెలకొంది. ఐసీసీ మాజీ అంపైర్ పాకిస్తాన్ కు చెందిన అసద్ రౌఫ్ (66)గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రవూఫ్ సోదరుడు తాహిర్ లెజెండరీ నిర్థారించారు. లాహోర్‌లోని లాండా బజార్‌లో ఉన్న తన బట్టల దుకాణాన్ని కట్టేసి..ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో.. అసద్ రౌఫ్ ఛాతీలో అసౌకర్యంతో బాధపడ్డాడని వెంటనే రవూఫ్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లారు, కానీ అతను కోలుకోలేకపోయాడు అని సోదరుడు తెలిపాడు. పంజాబ్‌లో జన్మించిన 66ఏళ్ళ అసద్ రౌఫ్ అంతర్జాతీయ క్రికెట్ లో 150కి పైగా మ్యాచ్ లకు నిర్వహించారు.  

ఇందులో 64 టెస్టులు (49 టెస్టులు ఆన్ ఫీల్డ్  అంపైర్ గా.. 15 మ్యాచ్ లో టీవీ అంపైర్ గా), 139 వన్డేలు, 28 టి20 మ్యాచ్ లు ఉన్నాయి.  పాకిస్తాన్ నుంచి అలీమ్ దార్ తర్వాత విజయవంతమైన అంపైర్ గా  పేరు తెచ్చుకున్న అసద్ రౌఫ్ ఐపీఎల్ మ్యాచ్ లకు కూడా అంపైర్ గా పని చేశారు. అయితే, 2013 ఐపీఎల్ సీజన్ లో స్పాట్ ఫిక్సింగ్ ఉదంతం అసద్ రౌఫ్ మెడకు చుట్టుకుంది. 

అసద్ రౌఫ్  ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు వినిపించాయి. బుకీల నుంచి అసద్ రౌఫ్ ఖరీదైన బహుమతులు స్వీకరించి, ఫిక్సింగ్కు పాల్పడినట్లు ఆరోపణలు  రాగానే బీసీసీఐ అతడిని పక్కనబెట్టి విచారణకు ఆదేశించింది. సుదీర్ఘ విచారణ తర్వాత దోషిగా తేలడంతో 2016లో బీసీసీఐ అతడిపై ఐదేళ్ల నిషేధం విధించింది. నిషేధం ముగిసినప్పటికీ అంపైర్ గా రీఎంట్రీ ఇచ్చేందుకు అసద్ రౌఫ్ ఇష్టపడలేదు. బీసీసీఐ ఇచ్చిన షాక్ కు అంపైరింగ్ వదిలేసిన అసద్ రౌఫ్ లాహోర్లోనే ఒక బట్టల షాపు నిర్వహించడం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

Robin Uthappa: క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన రాబిన్ ఊతప్ప..
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

T20 World Cup 2026 : టీమిండియాలో ముంబై ఇండియన్స్ హవా.. ఆర్సీబీ, రాజస్థాన్‌లకు మొండిచేయి !
Indian Cricket: టెస్టుల్లో 300, వన్డేల్లో 200, ఐపీఎల్‌లో 100.. ఎవరీ మొనగాడు?